Petrol diesel price today: పెట్రోల్ ధరలకు కళ్లెం పడటం లేదు. రోజురోజుకు సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. 16 రోజుల వ్యవధిలో 14వ సారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశరాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది.
• Mumbai Petrol prices: ముంబయిలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.120.51కు ఎగబాకింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.104.77కు చేరుకుంది.
• Petrol Price in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కు చేరింది. డీజిల్ ధర రూ.105.49కు ఎగబాకింది.
ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా 'టాటా న్యూ'.. అదిరే ఫీచర్లు, రివార్డులు..