ETV Bharat / business

Petrol Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు - పెట్రోల్ ధర

Petrol price today: దేశంలో పెట్రో బాదుడు ఆగడం లేదు. చమురు ధరలు 9 రోజుల్లో 8 సార్లు పెరిగి సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​​లో లీటర్​ పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇలా ఉన్నాయి.

petrol, diesel prices increased again
ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు
author img

By

Published : Mar 30, 2022, 7:28 AM IST

Oil Prices Hike: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు బుధవారం కూడా పెరిగాయి. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది సార్లు రోజువారీ ధ‌ర‌ల మార్పు మాటున చ‌మురు సంస్థ‌లు ధ‌ర‌ల‌ను పెంచేశాయి. బుధవారం హైదరాబాద్​లో పెట్రోల్​పై రూ.90 పైసలు, డీజిల్​పై 87 పైసల చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో పెట్రోల్ లీటర్ ధర రూ.114.51, డీజిల్ లీటర్ ధర రూ.100.70కి ఎగ‌బాకింది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లో పెట్రోల్ ధర. రూ.108.20, డీజిల్ ధర రూ.94.62గా ఉండ‌గా 8 సార్లు చ‌మురు సంస్థ‌లు ధ‌ర‌ల‌ను పెంచాయి. అంటే పెట్రోల్ లీట‌రుపై రూ.6.32 , డీజిల్ లీట‌రుపై రూ.6.08 లెక్క‌న ధ‌ర‌లు పెరిగాయి.

Diesel Price Today: ఆంధ్రప్రదేశ్​లో లీటర్‌ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.116.45, డీజిల్‌ రూ.102.27గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.116.25, డీజిల్‌ రూ.102.07కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్​ ధర 80 పైసల చొప్పున పెరిగింది. ఫలితంగా అక్కడ లీటర్ పెట్రోల్ ధర101.01కి చేరింది. లీటర్​ డీజిల్ ధర రూ. 92.27కి పెరిగింది.

ఇదీ చదవండి: ఖర్చు చేయకుండానే రూ.1000కోట్లు లెక్క.. 'హీరో' మెడకు ఐటీ ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.