ETV Bharat / business

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు!- కేంద్రం క్లారిటీ - తగ్గనున్న డీజిల్ ధర

Petrol Diesel Price Cut News : చమురు ధరలను తగ్గించనున్నట్లు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని కేంద్రమంత్రి హర్​దీప్​సింగ్ పురీ తెలిపారు.

Petrol Diesel Price Cut News
Petrol Diesel Price Cut News
author img

By PTI

Published : Jan 3, 2024, 9:45 PM IST

Petrol Diesel Price Cut News : లోక్​సభ ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ తెలిపారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చారు.

ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. లీటర్‌కు రూ.6 మేర తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదంటూ ప్రచారానికి కేంద్రమంత్రి చెక్‌ పెట్టారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అటు అభివృద్ధి చెందిన, పొరుగు దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరిగాయని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ అన్నారు. భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 40-80 శాతం మేర పెరిగాయని, పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని గుర్తు చేశారు. అదే సమయంలో భారత్‌లో 2021 నవంబర్‌, 2022 మే నెలలో రెండు సార్లు చమురు ధరలు తగ్గాయని చెప్పారు.

భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, ఎల్పీజీ దిగుమతిదారుగా ఉందని పురీ తెలిపారు. ఎల్‌ఎన్‌జీ దిగుమతి, రిఫైనరీ, ఆటోమొబైల్‌ మార్కెట్‌ పరంగా నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఎప్పడికప్పుడు చమురు ధరలు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికి అయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నారు. ఈ క్రమంలోనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చమురు ధరల తగ్గింపుపై ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ చమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయన్న అంశాన్ని హర్‌దీప్‌సింగ్‌ పురీ గుర్తుచేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.