ETV Bharat / business

మీకు పెంపుడు జంతువులంటే ప్రాణమా? అయితే 'పెట్​ ఇన్సూరెన్స్' మస్ట్​! బెనిఫిట్స్ ఏమిటంటే? - Benefits Of Dog Insurance in telugu

Pet Insurance Benefits In Telugu : మీకు పెంపుడు జంతువులు అంటే ఏంతో ఇష్టమా? వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరా? అయితే ఇది మీ కోసమే. కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువుల కోసం కచ్చితంగా పెట్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడే వాటికి ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ సంస్థలు నుంచి పరిహారం పొంది వాటికి తగిన చికిత్స అందించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

What is Pet Insurance
Pet Insurance Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 2:21 PM IST

Pet Insurance Benefits : మనలో చాలా మంది కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటితో ఆడుకుంటా చాలా ఆనందంగా గడుపుతారు. అవి లేకుండా జీవించలేని పరిస్థితికి చేరుకుంటారు. ఒక వేళ వాటికి ఏమైనా అయితే, ఇక తట్టుకోవడం వారి వల్ల కాదు. అందుకే ఇలాంటి వారి కోసం పలు బీమా సంస్థలు 'పెట్ ఇన్సూరెన్స్​'ను అందుబాటులోకి తెచ్చాయి.

పెట్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?
కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఏర్పాటు చేసినవే పెట్​ ఇన్సూరెన్స్ పాలసీలు. మనం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటామో, అలానే మనం పెంచుకునే జంతువుల కోసం కూడా ఈ పెట్​ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.

ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే!
నేటి కాలంలో పెంపుడు జంతువులను పెంచడం చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారంగా మారింది. వ్యాక్సినేషన్​, ట్రీట్​మెంట్​, గ్రూమింగ్​ లాంటి వాటికి ఏడాదికి ఎంత లేదనుకున్నా రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. వీటితోపాటు వెట్​ ఫీజు, వైద్య ఖర్చులు కలుపుకుంటే, ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. అందుకే మన పెంపుడు కుక్కలకు అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అత్యుత్తమ వైద్యాన్ని అందించడానికి పెట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం.

పెట్​ ఇన్సూరెన్స్ ఉపయోగాలు
Benefits Of Pet Insurance :

  • మన పెంపుడు జంతువుల కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల, వాటికి అయ్యే వైద్య, చికిత్స ఖర్చులు లభిస్తాయి.
  • చిన్న మొత్తంలో ప్రీమియం కడితే చాలు, మీ పెంపుడు జంతువులకు ప్రమాదం జరిగినా, మరణించినా, లేక ఎవరైనా దొంగిలించినా మీకు పరిహారం లభిస్తుంది.
  • పెట్​ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ డ్యామేజీలకు కూడా పరిహారం అందిస్తుంది.
  • పెంపుడు జంతువులను ఇతర దేశాలకు తీసుకువెళ్లేటప్పుడు జరిగిన నష్టానికి కూడా బీమా సంస్థలు పరిహారం అందిస్తాయి.

పెట్​ ఇన్సూరెన్స్ రకాలు
Types Of Pet Insurance Policies : మన దేశంలోని బీమా సంస్థలు పశువుల బీమాను ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాయి. అయితే భారత్​లో చాలా మంది కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల కోసం మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ఆయా పెట్​ ఇన్సూరెన్స్ పథకాలను అనుసరించి, మీరు చెల్లించే ప్రీమియంను అనుసరించి, బీమా కవరేజ్​లో వ్యత్యాసాలు ఉంటాయి.

కానీ ఓవరాల్​గా చూసుకుంటే- సర్జరీ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, ఓపీడీ ఖర్చులను బీమా సంస్థలు చెల్లిస్తాయి. అంతేకాదు, ప్రమాదం లేదా వ్యాధుల వల్ల పెంపుడు జంతువులు మరణిస్తే, ఆ నష్టానికి తగిన పరిహారం ఇస్తాయి. ఒకవేళ కుక్కను ఎవరైనా దొంగిలిస్తే, అందుకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్​ను కల్పిస్తాయి.

షరతులు వర్తిస్తాయి!
Pet Insurance Exclusions : పుట్టుకతో వచ్చిన లోపాలకు, అవసరం లేని కృత్రిమ శస్త్ర చికిత్సలకు, ప్రెగ్నెన్సీ, కాస్మొటిక్, దంత చికిత్సలకు బీమా కవరేజ్ ఉండదు.

పెట్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ
Eligibility For Pet Insurance : ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు 2 నెలల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న పెంపుడు జంతువులకు బీమా పాలసీలను అందిస్తాయి. స్వదేశీ, విదేశీ, సంకర జాతి కుక్కలు, పిల్లులు లాంటి జంతువులు అన్నింటికీ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.

భారతదేశంలో పెట్ ఇన్సూరెన్స్ అందిస్తున్న సంస్థలు
Pet Insurance Providers in India :

  • ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్​
  • గో డిజిట్​ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్​
  • బజాజ్​ ఆలయన్జ్​ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

పెళ్లి చేసుకుంటున్నారా? వెడ్డింగ్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - ఎందుకంటే?

బెస్ట్ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? తక్కువ బడ్జెట్లోని టాప్​-10 టూ-వీలర్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.