Osm Stream City Electric Auto : ఒమేగా సేకీ మొబిలిటీ మరో కొత్త విద్యుత్ వాహనం 'ఓఎస్ఎం స్ట్రీమ్ సిటీ'ని భారతమార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో.. ఎకో ఫ్రెండ్లీగా ఉంటూనే, ఆర్బన్ ప్యాసెంజర్ అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే
OSM Stream City Mileage : ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ఓటీఆర్ వాహనాన్ని ఫుల్ ఛార్జింగ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కి.మీ మైలేజీ వస్తుంది. ఓఎస్ఎమ్ స్ట్రీమ్ సిటీ ఆటోను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 117 కి.మీ మైలేజీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ విద్యుత్ వాహనంలో లిథియం-ఐయాన్ బ్యాటరీ ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనుక రోజంతా ఈ వాహనాన్ని నడుపుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇంటీరియర్ - సీటింగ్
OSM Stream City Interior : ఈ ఆటోలో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్యాసెంజర్ల కూర్చోవచ్చు. రూఫ్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉండి.. ప్రయాణికులకు రక్షణను కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది.
చాలా సేఫ్‌గా.. వేగంగా!
OSM Stream City High Speed : ఈ విద్యుత్ ఆటో గరిష్ఠంగా గంటకు 48 కి.మీ వేగంతో నడుస్తుంది. రహదారులపై 100 కి.మీ వరకు సాధారణ డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుంది. 16 శాతం వరకు గ్రేడబిలిటీ కూడా దీనికి ఉంది.
పర్యావరణానికి అనుకూలంగా!
Eco friendly Electric Auto : ఈ విద్యుత్ త్రిచక్ర వాహనం చాలా పర్యావరణ అనుకూలమైనది అని కంపెనీ చెబుతోంది. తక్కువ కర్బన ఉద్గారాలను, తక్కువ శబ్దాన్ని మాత్రమే ఇది విడుదల చేస్తుందని.. అందువల్ల ఇది పర్యావరణానికి చాలా అనుకూల వాహనమని ఓఎస్ఎం కంపెనీ అంటోంది.
వేరియంట్స్
OSM Stream City Electric Auto : ఆ విద్యుత్ ఆటో రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- స్వాపబుల్ బ్యాటరీతో వస్తున్న స్ట్రీమ్ సిటీ ఏటీఆర్ ధర రూ.1.85 లక్షలుగా ఉంది.
- ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తున్న స్ట్రీమ్ సిటీ ధర రూ.3.01 లక్షలు (ఎక్స్‌షోరూం ధర)
నాలుగు భిన్నమైన రంగుల్లో
OSM Stream City Color Options : ఓఎస్ఎం ఆటో నాలుగు భిన్నమైన రంగుల్లో లభిస్తుంది. తెలుపు, నీలం, నలుపు & పసుపు, పసుపు & పచ్చ రంగుల్లో లభిస్తోంది.
5 రెట్లు ఎక్కువ ఉత్పత్తి
విద్యుత్ వాహనాల ఉత్పత్తిని తాము ఇప్పటికే 5 రెట్లు ఎక్కువగా పెంచామని ఓఎస్ఎమ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. 2024 నాటికి కనీసం 10,000 విద్యుత్ త్రిచక్రవాహనాలను విక్రయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
"మేము మొదటిగా ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పుడు విద్యుత్ ప్యాసెంజర్ వాహనాన్ని తీసుకొచ్చాం. విద్యుత్ త్రిచక్ర వాహనాల (ఆటో) రంగంలోకి విస్తరించడానికి మేం అనుసరించిన వ్యూహం ఇది."
- ఉదయ్ నారంగ్, ఓఎస్ఎమ్ ఫౌండర్, ఛైర్మన్.
సన్ మొబిలిటితో కలిసి
ఒమేగా సేకీ మొబిలిటీ కంపెనీ.. సన్ మొబిలిటీతో కలిసి స్వాపబుల్ బ్యాటరీ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. దీని వల్ల తమ కస్టమర్లు చాలా సులభంగా త్వరగా బ్యాటరీలు మార్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వెల్లడించింది.
OSM Stream City Electric Auto : ప్రస్తుతం ఒమేగా సేకీ మొబిలిటీకి దేశవ్యాప్తంగా 175కి పైగా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. దీనితోపాటు ఓఎస్ఎమ్ తమ కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ సహకారం అందించడానికి వీలుగా.. ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఐడీఎఫ్సీ, ఛత్తీస్‌గఢ్ గ్రామీణ బ్యాంకు, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.