Ola Upcoming EV : ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 15న మరో సరికొత్త ఈవీని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. MoveOS4 అప్డేట్గా పిలుస్తున్న ఈ స్కూటర్.. ఓల్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అడ్వాన్స్డ్ ఫీజర్లతో వస్తుందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు.
Ola New Bike Look : ఓలా కంపెనీ కస్టమర్స్ డే ఆగస్టు 15. అందుకే ఆ రోజున తమ సరికొత్త మూవ్ఓఎస్ 4 అప్డేట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులకు పరిచయం చేసేందుకు ఓలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ అకౌంట్లో (Ola MoveOS 4 Electric Scooter) ఓలా మూవ్ఓఎస్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫొటోను పోస్ట్ చేశారు.
- — Bhavish Aggarwal (@bhash) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Bhavish Aggarwal (@bhash) August 11, 2023
">— Bhavish Aggarwal (@bhash) August 11, 2023
లాంఛ్ ఎప్పుడు?
Ola MoveOS 4 Electric Scooter : ఓలా మూవ్ఓస్ 4 అప్డేట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ సంవత్సరం చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఈ స్కూటర్లో సరికొత్త ఫీచర్లను పొందుపరుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇందులో ఓలా ఎస్1 ఈవీ కంటే కూడా అధునాతన ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు.
సూపర్ ఫీచర్స్!
Ola MoveOS 4 Features : ఓలా MoveOS 4 అప్డేట్ స్కూటర్లో కాన్సర్ట్ మోడ్ ఉంది. దీనిని ఓలా ఎస్1లో ఉన్న పార్టీ మోడ్‌కు కొనసాగింపుగా చెప్పకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని లైట్లు.. మ్యూజిక్కు అనుగుణంగా సింక్రొనైజ్ అవుతాయి. ఈ నయా ఫీచర్‌ను భవిష్యత్‌లో రానున్న ఓలా స్కూటర్లలో కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఓలా.. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడ్ ఆప్షన్లను కూడా పెంచే అవకాశం ఉంది. దీని వల్ల డిజిటల్ డిస్ప్లే కోసం భిన్నమైన హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో లైట్, ఆటో, డార్క్.. మూడ్ సెట్టింగ్స్ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఓలా మ్యాప్స్
Ola Maps Feature : ఓలా ఎలక్ట్రిక్ తన వినియోగదారుల కోసం సరికొత్త 'ఓలా మ్యాప్స్' ఫీచర్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా వాహన చోదకులు తమ మార్గంలోని ఛార్జింగ్ స్టేషన్లను చాలా సులువుగా గుర్తించగలుగుతారు. అలాగే ఈ ఓలా మ్యాప్స్ ద్వారా తమ ట్రిప్ రూట్‌ను ముందుగానే తెలుసుకోగలుగుతారు. ఇప్పటికే ఏథర్ కంపెనీ.. ఏథర్ ట్రిప్ ప్లానర్‌ను తీసుకొచ్చింది. అందుకే ఓలా కూడా సరిగ్గా ఇలాంటి ఫీచర్‌నే అభివృద్ధి చేస్తోంది.
ఓలా అప్‌కమింగ్ మోటార్ సైకిల్స్
Ola Latest Bike Design : ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా ద్విచక్రవాహనాలను తయారు చేసేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా వివిధ మోటార్ సైకిల్ మోడల్స్‌ను చాలా లోతుగా అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఓలా తయారు చేస్తున్న స్పోర్టీ ఆరా బైక్ డిజైన్.. KTM RC సిరీస్ ఆకృతిని పోలి ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. అయితే ఈ బైక్ డిజైన్ ప్రాథమిక దశలో లేదా ప్రీ-ప్రొడక్షన్ లేదా కాన్సెప్ట్ దశలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.