Ola S1 X+ Electric Scooter Offer : ప్రస్తుత దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దాంతో కంపెనీలు కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా భారత్‌లో అతిపెద్ద విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా(Ola) యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎండ్ ఐస్ ఏజ్ మిషన్‌ను వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా 'డిసెంబర్ టు రిమెంబర్' పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Ola Electric Scooter : ఈ నెల 3 నుంచి స్టార్ట్ అయిన 'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌లో భాగంగా ఓలా తన ఎస్1 ఎక్స్ ప్లస్(Ola S1 X Plus) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏకంగా రూ. 20వేల తగ్గింపును ఇస్తోంది. ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బంపర్ ఆఫర్.. డిసెంబర్ 31లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అనే విషయం గమనించాలి. ఇంతకీ ఆఫర్లో ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత ధరకు లభిస్తుంది? దాని ఫీచర్లు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఓలా ఎస్1 ఎక్స్+ ధర ఎంతంటే..
- ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999. కానీ, ఈ స్కూటర్‌పై ప్రస్తుతం రూ.20 వేల తగ్గింపు ఇవ్వడంతో.. దీని ఎక్స్షోరూ ధర రూ. 89,999కి దిగొచ్చింది.
- దీనితో పాటు ఫైనాన్స్ ఆఫర్స్ సైతం ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 5000 వరకు బెనిఫిట్ పొందొచ్చు.
- సులభమైన EMI విధానంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది కంపెనీ.
- అదే విధంగా జీరో డౌన్ పేమెంట్స్, జీరో ప్రాసెసింగ్ ఫీ 6.99 శాతం వడ్డీకే ఫైనాన్స్ కల్పించే సౌకర్యం అందిస్తోంది.
- అయితే.. ఈ ప్రైజ్ కట్ అనేది డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని సంస్థ వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.19వేలు తగ్గింపు!
ఈ స్కూటర్ ఫీచర్లు..
- ఇక ఓలా ఎస్1 ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి దీనిని ఛార్జ్ చేస్తే.. 151 కి.మీల దూరం వరకు ప్రయాణించొచ్చు.
- ఈ వెహికిల్ బ్యాటరీని 500వాట్ ఛార్జర్‌తో 7.4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
- ఈ స్కూటర్లో సమర్థమైన 6kW మోటార్‌ను అమర్చారు. దీంతో కేవలం 3.3 సెకన్స్‌లో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
- 0-60 కేఎంపీహెచ్ కోసం 5.5 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. దీని టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్.
- ఈ ఓలా ఎస్1 ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటి 3 మోడ్స్ ఉన్నాయి.
- ఇంకా దీనిలో 5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, రిమోట్ బూట్ అన్క్లాక్, నావిగేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
- బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీతో పాటు ఓటీఏ అప్డేట్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పొందొచ్చు.
- ఇంతటి అధనాతనమైన ఫీచర్లో వస్తున్న ఈ స్కూటర్‌పై ఉన్న తగ్గింపు పరిమిత కాలం మాత్రమే.
- తర్వాత ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఎవరైనా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ కొనేయడం మంచిది.
Honda Activa Limited Edition Scooter Launch 2023: హోండా నుంచి సరికొత్త స్కూటీ.. అదిరిపోయే ఫీచర్స్!