ETV Bharat / business

NPS Pension Scheme Get Returns 1 Lakh per Month : రిటైర్మెంట్ తర్వాత నెలకు లక్ష రూపాయల పెన్షన్.. ఈ పథకం తెలుసా..? - జాతీయ పెన్షన్ పథకం ప్రయోజనాలు

NPS Pension Scheme Get Returns 1 Lakh Per Month : వయసులో ఉన్నంత కాలం మాత్రమే సంపాదిస్తాం. కాబట్టి.. అందులో కొంత తప్పనిసరిగా పొదుపు చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. ఎలాంటి పొదుపు పథకాన్ని ఎంచుకుంటున్నామనేది కూడా ముఖ్యమే. నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన ఈ పథకంలో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తర్వాత నెలకు లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది..!

Get Returns 1 Lakh per Monthly Pension
NPS Pension Scheme Get Returns 1 Lakh per Month
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 10:11 AM IST

How to Generate 100K per Month from NPS : ఉద్యోగ విరమణ తరువాత జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఆర్థిక ఒత్తిడి ఉండకూడదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్‌ అయ్యేవరకు ప్రతివ్యక్తీ కాలంతో పరుగులు తీస్తారు. చూస్తుండగానే.. ఉద్యోగ విరమణ సమయం వచ్చేస్తుంది. వయసు ఉడిగి పోతుంది. ఉన్నట్టుండి సంపాదన ఆగిపోతుంది. రిటైర్మెంట్ తరవాత ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేది పెన్షనే. కాబట్టి.. ముందు నుంచే పొదుపు చేయడం అనివార్యం. అయితే.. రిటైర్ అయిన తరవాత మీకు నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్‌ వస్తే ఎలా ఉంటుంది? అలాంటి పథకాన్నే.. జాతీయ పింఛను పథకం (NPS) ప్రవేశపెట్టింది. మరి.. ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా లక్ష రూపాయలను అందించే ఈ స్కీమ్‌లో ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? ఎంతెంత పెట్టాలి? ఎవరు అర్హులు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

National Pension System Details in Telugu : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS). దీన్నే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ అని కూడా అంటారు. జాతీయ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దీనికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80సీల కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగ విరమణ తరవాత.. నెలకు లక్ష రూపాయల పింఛను పొందవచ్చు.

NPS Scheme Benefits : రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్​!

జాతీయ పెన్షన్‌ పథకం అనేది స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. ఇది ఆర్థిక భద్రతకు భరోసా కలిగిస్తుంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగులే కానవసరం లేదు.. దేశంలోని సాధారణ పౌరులతోపాటు ప్రవాస భారతీయులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం.. 20 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పెట్టుబడి పెట్టాలి. ఖాతాదారులు పెట్టిన పెట్టుబడిపై.. 9% నుంచి 12% వరకు సగటు రాబడిని ఈ పథకం అందిస్తుంది.

30 సంవత్సరాల పాటు నెలవారీగా రూ.10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా.. ప్రతినెలా లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి సెక్షన్‌ 80CCD (1) కింద రూ.50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. మరిన్ని అదనపు వివరాల కోసం.. దగ్గర్లోని పోస్టాఫీస్​ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

How to Generate 50K per Month from NPS : రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు పెన్షన్ .. ఈ పథకం తెలుసా..?

Retirement Planning : నెలకు రూ.50 వేలు పెన్షన్ ఇచ్చే.. బెస్ట్​ రిటైర్​మెంట్ ప్లాన్స్​​ మీకు తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.