Commercial LPG Cylinder Price : వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు గుడ్‌న్యూస్. 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.83.50 తగ్గించినట్లు తెలిపాయి. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1773కు చేరుకుంది. తగ్గిన సిలిండర్ ధరలు జూన్ 1నే అమల్లోకి వచ్చాయి. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలు నిర్ణయిస్తాయి. గడిచిన రెండు నెలల్లో రెండు సార్లు కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. మే 1న రూ. 172, ఏప్రిల్ 1న రూ. 91.50 మేర చమురు సంస్థలు ధరలు తగ్గించాయి.
Commercial LPG Cylinder Price :
కొత్త లెక్కల ప్రకారం దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1773 ఉండగా.. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1103గా ఉంది. కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1875.50, ముంబయిలో రూ.1725, చెన్నైలో రూ. 1973గా ఉంది.
వేర్వేరు నగరాల్లో ఒక్కో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర..
- పట్నా- రూ. 1201.
- కన్యాకుమారి- రూ.1187.
- అండమాన్- రూ. 1179.
- రాంచీ- రూ. 1160.50
- దెహ్రాదూన్- రూ.1122.
- చెన్నై- రూ. 1118.50
- ఆగ్రా- రూ. 1115.50
- చండీగఢ్- రూ.1112.50.
- అహ్మదాబాద్- రూ.1110.
- సిమ్లా- రూ. 1147.50
- లఖ్‌నవూ- రూ. 1140.50
Commercial LPG Cylinder Price : అంతకు ముందు గ్యాస్ కంపెనీలు.. మార్చ్ 1వ తేదీన ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 350.50, ఒక్కో డొమెస్టిక్ ఎల్పీజీ సలిండర్పై రూ. 50 వరకు పెంచాయి. గతేడాది ఆగస్ట్ 1వ తేదీన ఒక్కో డొమెస్టిక్ ఎల్పీజీ సలిండర్పై రూ.36, తర్వాత నెల సెప్టెంబర్‌లో ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 91.50 వరకు తగ్గించాయి.
2022 మేలో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,355.50 ఉండగా ప్రస్తుతం తగ్గిన ధరలతో రూ.1773 ఉంది. ఈ ఏడాది కాలంలో రూ. 582.50 మేర తగ్గింది. మార్చ్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.50 పెంచగా.. ప్రస్తుతం స్థిరంగా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1103.
తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ ధరలు.. తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2325, 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1155గా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2294 ఉండగా.. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1112 ఉంది.