ETV Bharat / business

'ఈవీ వాహనాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు'.. గడ్కరీ వార్నింగ్​

Nitin Gadkari EV: విద్యుత్​ వాహనాల తయారీలో నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. వాహనదారుల భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 'ఈవీ పేలుడు' ఘటనలపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

gadkari
నితిన్​ గడ్కరీ
author img

By

Published : Apr 22, 2022, 4:25 AM IST

Nitin Gadkari EV: విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. విద్యుత్‌ వాహనాల తయారీలో తప్పక నాణ్యత పాటించాలని సూచించారు. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. దాంతోపాటు వాహనాలను రీకాల్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాహనదారుల భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం వరుస ట్వీట్లు చేశారు.

ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం రాయితీ ఇస్తుండటంతో వీటి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో కూడా విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలి ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలోనే గడ్కరీ స్పందించారు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఈవీ పేలుడు' ఘటనలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడినట్లు మంత్రి తెలిపారు.

ఈ ఘటనలపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులు చేస్తుందని గడ్కరీ తెలిపారు. వాటి ఆధారంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. వాహన తయారీలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు.. లోపమున్న వాహనాలను వెనక్కి రప్పించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ లోపాన్ని గుర్తిస్తే వెంటనే వాహనాలను వెనక్కి రప్పించి సరిచేయాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: వారం రోజుల్లో ఐపీఓకు 'రెయిన్​బో' హాస్పిటల్​.. 'ఎల్​ఐసీ' ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.