New IMPS Online Money Transfer Rule : నేడు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు చాలా సులభం అయిపోయాయి. ఎక్కడికైనా, ఎవరికైనా చాలా సులువుగా మనీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. వాస్తవానికి ఆన్లైన్లో డబ్బులు పంపించడానికి వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి:
- నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (NEFT)
- రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS)
- ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (IMPS)
వీటిలో ఐఎంపీఎస్ పద్ధతిని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీని ద్వారా చాలా సులువుగా, త్వరగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం.
మరింత సులువుగా!
ఇప్పటి వరకు ఎవరైనా ఐఎంపీఎస్ పద్ధతిలో డబ్బులు పంపించాలంటే.. లబ్ధిదారుని పేరు, అతని బ్యాంక్ ఖాతా నంబర్, ఇండియన్ ఫైనాన్సియల్ సిస్టమ్ కోడ్ (IFSC)లను కచ్చితంగా నమోదు చేయాల్సి ఉండేది. ఇకపై వీటి అవసరం ఉండదు. కేవలం లబ్ధిదారుని ఫోన్ నంబర్, అతని బ్యాంక్ పేరు నమోదు చేస్తే సరిపోతుంది.
ఇంతకీ ఐఎంపీఎస్ అంటే ఏమిటి?
What is Immediate Payment Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తక్షణ దేశీయ నిధుల బదిలీల కోసం IMPS విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ఐఎంపీఎస్ విధానం ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారానూ మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఏటీఎం, ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ విధానంలోనూ డబ్బులు పంపించుకోవచ్చు.
IMPS Features
- ఐఎంపీఎస్ ద్వారా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంక్‌కు చాలా సులువుగా, ఇన్‌స్టాంట్‌గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
- సమయం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ఎక్కడి నుంచి అయినా, ఏ సమయంలోనైనా డబ్బులు పంపించుకోవచ్చు.
- ఐఎంపీఎస్ విధానంలో రోజుకు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చు.
- ఐఎంపీఎస్ విధానంలో చేసే ఆర్థిక లావాదేవీలకు.. వాటి విలువను అనుసరించి రూ.5 నుంచి రూ.15 వరకు రుసుము వసూలు చేస్తారు. దీనితో పాటు సర్వీస్ టాక్స్ కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది.
ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఎలా?
How to transfer money through IMPS :
- ముందుగా మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఓపెన్ చేయండి
- మెయిన్ పేజీలోని Fund Transfer ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- IMPS ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలని అనుకుంటున్నారో.. అతని/ఆమెకు చెందిన MMID (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్), MPIN (మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్)ను ఎంటర్ చేయండి.
- సింపుల్‌గా చెప్పాలంటే.. లబ్ధిదారుని బ్యాంక్ పేరు, అతని మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. తరువాత..
- మీరు పంపించాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేసి.. మనీ ట్రాన్స్ఫర్ను Confirm చేయండి.
- మీ రిజిస్టర్ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. దీనితో మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది.