ETV Bharat / business

'త్వరలో కొత్త పింఛన్​ ప్లాన్​.. కనీస రాబడి వచ్చేలా'

author img

By

Published : Apr 10, 2022, 7:44 AM IST

National Pension scheme: పింఛను రూపంలో కనీస రాబడి అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పీఎఫ్​ఆర్​డీఏ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కన్సల్టెంట్​లను నియమించుకున్నామని ఛైర్మన్​ సుప్రతిమ్​ బంద్యోపాధ్యాయ్​ తెలిపారు. అక్చురియల్‌ సంస్థతో కలిపి పింఛను సలహా కమిటీలోని కొంత మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Supratim Bandyopadhyay
పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ సుప్రతిమ్‌ బంద్యోపాధ్యాయ్‌

National Pension scheme: పింఛను రూపంలో కనీస రాబడి అందించే కొత్త పథకాన్ని సెప్టెంబరు నాటికి తీసుకొస్తామని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్‌పర్సన్‌ సుప్రతిమ్‌ బంద్యోపాధ్యాయ్‌ వెల్లడించారు. దీని కోసం గత కొంత కాలంగా చర్చలు సాగుతున్నాయని, కన్సల్టెంట్‌ను ఇప్పటికే నియమించుకున్నామని, దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద కనీస హామీ రాబడి పింఛను ప్లాన్‌ను రూపొందించేందుకు ఫిబ్రవరిలో ఈవై అక్చురియల్‌ సర్వీసెస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నియమించింది.

అక్చురియల్‌ సంస్థతో కలిపి పింఛను సలహా కమిటీలోని కొంత మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బంధ్యోపాధ్యాయ్‌ వెల్లడించారు. ఈ కమిటీ కొత్త పథకాన్ని రూపొందిస్తోందని తెలిపారు. చాలా నమూనాలపై ప్యానెల్‌ చర్చిస్తోందని, ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత ఒక సాధారణ పథకాన్ని ప్రారంభించి, తర్వాత ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఎవరికి వారు సొంత పథకాలన తీసుకొని రావాల్సిందిగా ఫండ్‌ మేనేజర్లను కోరతామని సుప్రతిమ్‌ పేర్కొన్నారు. వీటికి కచ్చితంగా పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతి తీసుకొనే ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. కనీస హామీతో పింఛను ప్లాన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరమవుతాయని, ఆయా ప్రభుత్వాలు వారి ఉద్యోగులను ఈ పథకం కింద చేర్చాల్సి ఉంటుందని తెలిపారు.

2022-23కు రూ.9.5 లక్షల కోట్ల నిధి: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) కింద మార్చి 31 నాటికి రూ.7.37 లక్షల కోట్ల నిధులున్నాయని, ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి 27.4 శాతం అదనంగా ఉన్నాయని వివరించారు. 2021-22లో పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 30 శాతం మేర వృద్ధి సాధిస్తాయని అంచనా వేశాం. అయితే 27.4 శాతం వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఒడుదొడుకులు, మార్కెట్‌ వడ్డీ రేట్లతో వృద్ధి స్వల్పంగా తగ్గిందన్నారు.
చందాల ప్రవాహం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం పెరిగి రూ.1.33 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపారు. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోపై గత ఆర్థిక సంవత్సరంలో 17.5-20 శాతం ప్రతిఫలం వచ్చిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ బాండ్లపై 5 శాతం, కార్పొరేట్‌ బాండ్లపై 7 శాతం వడ్డీ రేటు లభించిందన్నారు.
పింఛను నిధి మొత్తంలో 18-19 శాతం ఈక్విటీలో, 50-52 శాతం ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు బంధ్యోపాధ్యాయ్‌ వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పింఛను నిధి మొత్తం 30 శాతం వృద్ధితో రూ.9.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2020-21లో ఎన్‌పీఎస్‌ నిధి 38 శాతం మేర పెరిగి రూ.5.78 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19 రెండు దశల ప్రభావం పింఛను నిధులపై ఎక్కువగా లేదని వివరించారు.

కొత్త మేనేజర్లు: పింఛను నిధి మేనేజర్లుగా గత ఏడాది టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి అనుమతులు పొందాయని, ప్రస్తుతం అవి పింఛను నిధి నిర్వహణ కంపెనీల ఏర్పాటులో ఉన్నాయని బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. వ్యాపారం ప్రారంభించడానికి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 3 కంపెనీలు కాకపోయినా జూన్‌ నాటికి 2 కంపెనీలయినా కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అనుకుంటున్నామన్నారు. చందాదార్లు తమ టైర్‌-2 నిధుల్ని 100 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు గత సమావేశంలో పీఎఫ్‌ఆర్‌డీఏ బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. గతంలో ఇది 75శాతంగానే ఉండేదని, వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి చందాదార్లు తమ మొత్తం నిధుల్ని ఈక్విటీల్లోకి ఈ నెలాఖరు నుంచి చొప్పించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజుల పనికే ఉద్యోగుల జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.