NABARD Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగనే అభ్యర్థులకు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) శుభవార్త అందించింది. సంస్థలోని పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నాబార్డ్. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం నెలకు రూ.లక్ష వరకు అందనుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, గడువు వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాజెక్ట్ మేనేజర్‌కు విద్యార్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా పర్యావరణ శాస్త్రం, వ్యవసాయంలో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ/ సివిల్‌లో ఎంటెక్/ నీటి వనరులు ప్రత్యేక సబ్జెక్ట్‌తో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ ఇరిగేషన్ ఇంజినీరింగ్/ హైడ్రోలజీ/ భూసారం, నీటి వనరుల సంరక్షణలో ఇంజినీరింగ్/ భూగర్భ జలాలపై ఇంజినీరింగ్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. ముఖ్యంగా భూగర్భ జలాలు/ జల వనరుల నిర్వహణ, సోలార్ పంపు ఇన్స్టలేషన్ వంటి ప్రాజెక్టుల్లో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ అసోసియేట్‌కు అర్హతలు: స్టాటిస్టిక్స్‌లో ఎంబీఏ లేదా పీజీ చేసి ఉండాలి/ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్/ గుర్తింపు పొందిన కళాశాలలో 60 శాతం మార్కులతో కంపూటర్ సైన్స్‌లో ఎంటెక్ డిగ్రీ ఉండాలి. ఎంఐఎస్, ఎంఅండ్ఈలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ విద్యార్హతలు: సోషల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేయాలి/ కామర్స్, మేనేజ్మెంట్లో మాస్టర్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్స్‌పై నైపుణ్యం ఉండాలి.
- నాబార్డ్‌లో వేతనాలు ఇలా: ప్రాజెక్ట్ మేనేజర్‌కు వేతనం నెలకు రూ.90వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్(మానిటరింగ్ అండ్ ఎవాల్యూయేషన్)కు వేతనం నెలకు రూ.40వేల నుంచి రూ.45 వేల వరకు అందుతుంది.
- జల వనరుల విభాగం నిపుణుడికి నెలకు రూ.45వేల నుంచి రూ.50వేల వరకు వేతనం వస్తుంది.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు నెలకు రూ.20 వేల వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు చేసే విధానం: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సూచించిన విధంగా అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 2022, ఏప్రిల్ 13 నుంచి 2022, ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చారు. ఈ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగి పనితీరును బట్టి పొడిగించే వీలుంది. ఈ కింది లింకుల ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి: Infosys q4 Results: 'కొత్తగా 50 వేల ఉద్యోగాలు.. రష్యాతో డీల్స్‌కు నో'