ETV Bharat / business

ఒకేచోట మదుపు ఎప్పుడూ ప్రమాదమే.. మీరేం చేయాలంటే? - multi asset funds fidelity

Multi asset funds: మదుపరుల పెట్టుబడి అవసరాలను తీర్చే విధంగా మ్యూచువల్‌ ఫండ్లు ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తూనే ఉన్నాయి. పెట్టుబడిదారుల లక్ష్యాలు, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, వ్యవధి, నిర్వహణ శైలి ఇలా పలు రకాలుగా ఒక వ్యక్తి తనకు సరిపోయే పథకాలను ఎంచుకోవచ్చు. మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా.. అందుకు తగ్గట్టుగా వ్యవహరించే పథకాలు ఇప్పుడు ఎంతో కీలకంగా మారాయి. ఇలాంటి వాటిల్లో ప్రముఖంగా మల్టీ అసెట్‌ ఫండ్లను చెప్పుకోవచ్చు.

mutual funds
మల్టీ అసెట్‌ ఫండ్
author img

By

Published : May 7, 2022, 2:10 PM IST

Multi asset funds: ఒకేచోట మదుపు చేయడం ఎప్పుడూ ప్రమాదమే. దీనికి భిన్నంగా రెండుమూడు రకాల పెట్టుబడుల్లో మదుపు చేయడమే మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్ల ప్రత్యేకత. దీర్ఘకాలిక వ్యూహంతో, విభిన్నమైన పెట్టుబడుల్లో మదుపు చేయాలని భావించే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. ఒకే తరహా పెట్టుబడి ఫండ్లతో పోలిస్తే.. వీటిల్లో కాస్త నష్టభయమూ తక్కువే.

ఈ మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్లు తప్పనిసరిగా తమ పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని మూడు విభిన్న ఆస్తులలో మదుపు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో చాలా ఫండ్‌ సంస్థలు దీనికోసం దేశీయ ఈక్విటీ, డెట్‌, బంగారాన్ని ఎంచుకుంటున్నాయి. కొంతమంది ఫండ్‌ మేనేజర్లు అంతర్జాతీయ ఈక్విటీల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఒక మోస్తరు నష్టాన్ని భరించే వారు ఇలా పలు రకాల పెట్టుబడుల నుంచి ఒకే పథకం ద్వారా ప్రయోజనం పొందాలని అనుకున్నప్పుడు ఈ తరహా ఫండ్లను పరిశీలించవచ్చు.

మిశ్రమంగా..: ఒకే పథకంలో మదుపు చేయడం ద్వారా మిశ్రమ ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంటాయి మల్టీ అసెట్‌ ఫండ్లు. దీంతో ఆయా విభాగాల్లో వచ్చే లాభాలను అందుకునేందుకు దోహదం చేస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడి మొత్తానికి రక్షణను అందిస్తుంది. ఈక్విటీ, డెట్‌, బంగారంతోపాటు కొందరు ఫండ్‌ మేనేజర్లు కమోడిటీలు, అంతర్జాతీయ మార్కెట్‌లలో ఉన్న అవకాశాలనూ అన్వేషిస్తుంటారు. స్పష్టమైన, విలక్షణమైన పెట్టుబడులను అందించడమే లక్ష్యంగా ఈ ఫండ్లు పనిచేస్తాయన్నమాట.

సౌలభ్యం: కొత్త తరం మదుపరులు ఎంతోమంది మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌ను అర్థం చేసుకోవడంతోపాటు, వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్నీ గుర్తిస్తున్నారు. నష్టభయం అధికంగా ఉన్నచోట ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను నిరంతరం పర్యవేక్షించడం అంత తేలిక కాదు. మల్టీ అసెట్‌ ఫండ్లలో వైవిధ్యం అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి, మదుపరులు ఒక్కో తరహా పథకాన్ని ఎంచుకొని, వాటిని నిర్వహించాల్సిన అవసరాన్ని ఇవి తగ్గిస్తాయి.

సమతౌల్యం చేసుకుంటూ..: పెట్టుబడుల జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగుతుండాలి. అప్పుడే మంచి రాబడులు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. మల్టీ అసెట్‌ ఫండ్లు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ.. సమతౌల్యం చేస్తూ ఉంటాయి. మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు దానిని తట్టుకునే శక్తిని ఈ ఫండ్లు అందిస్తాయి.

పన్ను ప్రయోజనాలు: ఈక్విటీ, డెట్‌.. ఇలా ఒక అసెట్‌ క్లాస్‌ నుంచి మరోదానికి మార్చుకోవాలని అనుకున్నప్పుడు.. కొన్నిసార్లు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. దీనివల్ల మదుపరులపై భారం పడుతుంది. దీన్ని తప్పించుకునేందుకు మల్టీ అసెట్‌ ఫండ్లను ఒక మార్గంగా ఎంచుకోవచ్చు. ఇవి అన్ని విభాగాల పెట్టుబడుల్లోనూ మదుపు చేస్తాయి. అవసరాన్ని బట్టి, పెట్టుబడులు మారుస్తూ ఉంటాయి. ఇవన్నీ సంస్థాగత స్థాయిలో ఉంటాయి కాబట్టి, చిన్న మదుపరులకు పన్ను భారం అంతగా ఉండదు.

- ఆశిష్‌ నాయక్‌, ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌

ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెరుగుతున్న వేళ- ఆర్థిక ప్రణాళికలు వేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.