ETV Bharat / business

సాలరీ విషయంలో వరుసగా రెండో ఏడాది షాక్ ఇచ్చిన అంబానీ - reliance chairman news

Mukesh Ambani salary per annum : ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ.. వరుసగా రెండో ఏడాది ఎలాంటి వేతనమూ తీసుకోలేదు. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం దృష్ట్యా వేతనం తీసుకోరాదని 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించుకున్న అంబానీ.. 2021-22లోనూ అదే పంథా కొనసాగించారు.

mukesh ambani salary per annum
ముకేశ్ అంబానీ
author img

By

Published : Aug 8, 2022, 1:25 PM IST

Mukesh Ambani salary per annum : దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ.. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నుంచి వరుసగా రెండో ఏడాది ఎలాంటి వేతనమూ తీసుకోలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ వేతనం 'సున్నా' అని వార్షిక నివేదికలో పేర్కొంది రిలయన్స్. 2021-22లోనూ ఆయన అదే పంథాను కొనసాగించినట్లు తెలిసింది. ఈ రెండేళ్లు.. రిలయన్స్​ ఛైర్మన్​, మేనేజింగ్ డైరక్టర్​గా అంబానీ ఎలాంటి భత్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్, స్టాక్ ఆప్షన్స్​, ఇతర ప్రయోజనాలేవీ పొందలేదు.

Mukesh Ambani salary in Indian Rupees : ముకేశ్ అంబానీ 2020 జూన్​లో తన వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కరోనా విజృంభణ.. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రతికూల ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు.. 2019-20లో అంబానీ రూ.15కోట్ల వార్షిక వేతనం పొందారు. ఏటా రూ.24కోట్లు తీసుకునే అవకాశమున్నా.. మేనేజర్ స్థాయి జీతాలు తక్కువగా ఉండాలన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచేందుకు 2008-09 నుంచి ఆయన 11 సంవత్సరాల పాటు రూ.15కోట్ల వార్షిక వేతనం మాత్రమే తీసుకోవడం గమనార్హం.

రిలయన్స్​లోని ఇతర ముఖ్యుల వేతనాల వివరాలు చూస్తే..

  • అంబానీ బంధువులు, రిలయన్స్​ హోల్​టైమ్​ డైరక్టర్లు అయిన నిఖిల్ మేస్వాని, హితల్ మేస్వాని.. 2021-22లో ఒక్కొక్కరు రూ.24కోట్ల వార్షిక వేతనం తీసుకున్నారు. ఇందులో రూ.17.28కోట్లు కమీషన్.
  • ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు పీఎంఎస్​ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్​ వేతనం స్వల్పంగా తగ్గింది. 2020-21లో రూ.11.99కోట్లు అందుకున్న ప్రసాద్​ 2021-22లో రూ.11.89కోట్లు వేతనం తీసుకున్నారు. కపిల్ విషయంలో ఆ మొత్తం రూ.4.24కోట్ల నుంచి రూ.4.22కోట్లకు తగ్గింది.
  • Nita Ambani income : రిలయన్స్ బోర్డ్ నాన్​ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, అంబానీ భార్య నీతా అంబానీ 2021-22లో రూ.5లక్షలు సిట్టింగ్ ఫీజు, రూ.2కోట్లు కమీషన్ అందుకున్నారు. అంతకుముందు ఏడాది రూ.8లక్షలు సిట్టింగ్ ఫీజు, రూ.1.65కోట్లు కమీషన్ పొందారు నీతా అంబానీ.

దుమ్మురేపిన రిలయన్స్​.. ఫార్చ్యూన్-500 లిస్ట్​లో ఒకేసారి 51 ర్యాంకులు జంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.