దీపావళి సందర్భంగా జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటల 15 నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సాగిన ట్రేడింగ్‌లో.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ 524 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17,730 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకుముందు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య అతిథిగా హాజరై.. గంట కొట్టి ట్రేడింగ్‌ను ప్రారంభించారు.
కొత్త సంవత్ ప్రారంభం.. 'మూరత్ ట్రేడింగ్'తో లాభాల్లో ముగిసిన మార్కెట్లు - మూరత్ ట్రేడింగ్ 2022
19:23 October 24
లాభాల్లో ముగిసిన మూరత్ ట్రేడింగ్
18:08 October 24
లాభాలతో ప్రారంభమైన మూరత్ ట్రేడింగ్.. గంట కొట్టి ఆరంభించిన అజయ్ దేవగణ్
దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లలో ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్లలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని నమోదు చేసి 59,942 పాయింట్లును తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17,750 పాయింట్లకు పైగా ఎగబాకింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
16:36 October 24
మూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా?
స్టాక్ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. ధనత్రయోదశి రోజు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని ప్రజలు ఎలా ఆశపడతారో.. ఈ ట్రేడింగ్ కూడా అలాంటిదే. ఇక ఆ రోజు స్టాక్ బ్రోకింగ్ కార్యాలయాలన్నీ దీపకాంతుల్లో వెలిగిపోతుంటాయి.
మూరత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. మూరత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్‌తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు.