Lpg Gas Cylinder Price Increase : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.21 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఈమేరకు ధరలు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. అయితే.. గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
హోటల్స్, రెస్టారెంట్స్ సహా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ బండ ధర ఇప్పటివరకు దిల్లీలో 1,775.50గా ఉంది. తాజా పెంపుతో అది రూ.1,796.50కు చేరింది.
తగ్గిన ఏటీఎఫ్ ధర..
ATF Fuel Price In India : మరోవైపు.. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్-ఏటీఎఫ్ ధర 4.6శాతం మేర తగ్గినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఇప్పటివరకు దిల్లీలో కిలోలీటరుకు రూ.1,11,344.92గా ఉన్న ఏటీఎఫ్ ధర.. రూ.1,06,155.67కు తగ్గినట్లు తెలిపాయి. గత నెల రోజుల్లో ఏటీఎఫ్ ధర తగ్గడం ఇది రెండోసారి.
గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేది ఎవరు?
Who Decides LPG Prices In India : ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. కాగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 20 నెలలుగా ఎటువంటి మార్పు లేదు.
ఎల్పీజీ ఉపయోగాలు
LPG Gas Uses : లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG)ని మోటార్ ఇంధనంగా, వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు. అలాగే పరిశ్రమల్లో తాపన, శీతలీకరణ (హీటింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) కోసం కూడా ఎల్పీజీని ఉపయోగిస్తారు.
ఎల్పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే.. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?