ETV Bharat / business

Life Insurance Benefits At Early Age : మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కావాలా?.. వెంటనే జీవిత బీమా తీసుకోండి! - ఆరోగ్య బీమా ప్రయోజనాలు

Life Insurance Benefits At Early Age In Telugu : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? కుటుంబ బాధ్యతలు అన్నీ మీ మీదే ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే. యుక్త వయస్సులో ఉన్నప్పుడే జీవిత బీమా, ఆరోగ్య బీమాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advantages of Buying Life Insurance Plan at Early Age
life insurance benefits at early age
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 12:38 PM IST

Life Insurance Benefits At Early Age : ఒక కుటుంబానికి ఆహారం, దుస్తులు, నివాసం ఎంత అవసరమో.. జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా అంతే అవసరం. మరీ ముఖ్యంగా కుటుంబంలో సంపాదించే వారికి జీవిత బీమా, ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థికంగా చేయూత లభిస్తుంది. గతంలో చాలా మంది జీవిత బీమా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారు. కానీ కరోనా సంక్షోభం తరువాత అందరూ బీమా అవసరాన్ని గుర్తించారు.

యువ భారత్​
నేడు భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా 35 ఏళ్లలోపు యువతీయువకులు దాదాపు 66 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలా మంది కొత్తగా ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టి ఉంటారు. వీరిపై ఆధారపడి ఓ కుటుంబం ఉంటుంది. అయినా సరే జీవిత బీమా తీసుకోవడానికి వీరు ఇష్టపడరు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

చిన్న వయస్సులోనే బీమా తీసుకుంటే..
Benefits Of Buying Health Insurance At Early Age : చిన్న వయస్సులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకుంటే.. కట్టాల్సిన ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రీమియం మొత్తం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. యుక్త వయస్సులో ఉన్నవారికి చాలా వరకు ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక మరణాలు కూడా తక్కువగానే ఉంటాయి. అదే వయస్సు పెరుగుతున్న కొలదీ ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అందుకే బీమా కంపెనీలు యుక్త వయస్సులో ఉన్నవారికి తక్కువ ప్రీమియానికే బీమా సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు అతి చిన్న వయస్సులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.

ఉదా: 25 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలపరిమితితో రూ.1 కోటి విలువైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, వార్షిక ప్రీమియంగా దాదాపు రూ.10,500 వరకు చెల్లించాలి. 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి పాలసీ తీసుకుంటే దాదాపు రూ.13,800 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే అతను 40 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.21,500 వరకు చెల్లించాలి. అదే 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆగి పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం దాదాపు రూ.37,000 వరకు చెల్లించవలసి ఉంటుంది.

గ్రూప్​ ఇన్సూరెన్స్​
Group Insurance Benefits To Employees : కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్​ పాలసీలను అందిస్తూ ఉంటాయి. ఇది కొంత వరకు ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. అయితే, ఈ ఆర్థిక భద్రత అనేది సదరు కంపెనీలో పనిచేసే వరకు మాత్రమే ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఉద్యోగం మారినప్పుడు, ఈ కవరేజ్‌ అనేది లేకుండా పోతుంది.

కొన్ని కంపెనీలు ఉద్యోగుల కోసం గ్రూప్‌ ఇన్సూరెన్స్​ కవరేజ్​ ఇవ్వకపోవచ్చు. ఇలాంటి తరుణంలో.. ఏమైనా దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడితే.. సదరు ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. అందుకే కచ్చితంగా ఉద్యోగులు లేదా కుటుంబ భారాన్ని మోసే వ్యక్తులు కచ్చితంగా విడిగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి.

రైడర్స్‌ యాడ్​ చేసుకోవాలి!
Insurance Rider Benefits : జీవిత బీమా, ఆరోగ్య బీమాలు తీసుకున్నప్పుడే.. రైడర్లు లేదా యాడ్​-ఆన్​లను కూడా వాటికి జతచేయాలి. దీని వల్ల మీ బీమా కవరేజ్​ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రమాదం, అంగ వైకల్యం, క్రిటికల్ ఇల్​నెస్ లాంటి సమస్యలను కవర్​ చేసే రైడర్లను ఎంచుకోవాలి. కొన్ని యాడ్​-ఆన్​లు లేదా రైడర్లు.. కట్టాల్సిన ప్రీమియాన్ని కూడా మాఫీ చేస్తుంటాయి. ఇలాంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు. సాధారణంగా యుక్త వయస్సులో బీమా పాలసీలు తీసుకుంటే ఇలాంటి రైడర్లను సులువుగా పొందవచ్చు. వయసు పెరిగే కొద్దీ బీమా కంపెనీలు కొన్ని రకాల రైడర్స్‌ను ఇవ్వడానికి నిరాకరించవచ్చు.

క్లెయిమ్ సెటిల్మెంట్
యుక్త వయస్సులో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారి క్లెయిమ్​లను తిరస్కరించే అవకాశాలు తక్కువ. సాధారణంగా వయస్సు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కనుక బీమా సంస్థలు.. క్లెయిమ్స్ సెటిల్​ చేయడంలో జాప్యం చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు వివిధ రకాల కారణాలు చెబుతూ తిరస్కరిస్తూ ఉంటాయి కూడా. అందుకే వీలైనంత త్వరగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Credit Card Usage Tips : సిబిల్ స్కోర్ పెరగాలా?.. క్రెడిట్ కార్డును వాడండి ఇలా!

Tata To Make IPhones In India : ఐఫోన్.. ఇక మేడ్ బై టాటా! భారత్​లో తయారీతో ధరలు తగ్గుతాయా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.