ETV Bharat / business

మార్కెట్లోకి ఎల్​ఐసీ ఎంట్రీ.. షేర్లపై డిస్కౌంట్​.. ధర ఎంతంటే?

LIC listing price: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్​ఐసీ షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో గ్రే మార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించినట్లుగానే ఎల్​ఐసీ షేర్లు రాయితీతో ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. దీంతో భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు. లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం బిడ్లు దాఖలు చేసిన చిరు మదుపర్లకు కూడా నిరాశే మిగిలింది.

lic ipo
ఎల్​ఐసీ
author img

By

Published : May 17, 2022, 11:39 AM IST

LIC listing price: దేశం ఆసక్తిగా ఎదురుచూసిన ఎల్​ఐసీ ఐపీఓ షేర్లు.. మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్​ఎస్​ఈలో ఎల్​ఐసీ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం రాయితీతో రూ.872 వద్ద లిస్టయ్యింది. దీంతో 15 షేర్లకు రూ.14,235 పెట్టుబడిగా పెట్టిన మదుపర్లకు రూ.1,155 లిస్టింగ్‌లాస్‌ తప్పలేదు. బీఎస్​ఈలో ఒక్కో షేరు ఎల్​ఐసీ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.62 శాతం రాయితో రూ.867.20 పైసల వద్ద లిస్టయింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్​ఐసీ గరిష్ఠ ధర వద్ద రూ.20,557 కోట్లు సమీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వేళ ఎల్​ఐసీ షేర్లు లిస్టింగ్‌కు రావడం ప్రతికూలాంశంగా మారింది. ఎల్​ఐసీ ఐపీఓకి దాదాపు మూడు రెట్ల స్పందన లభించింది. ముఖ్యంగా ఒక్కో షేరుపై 60 రూపాయలు రాయితీ పొందిన పాలసీదారులు వారికి కేటాయించిన విభాగంలో 6 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. ఉద్యోగుల విభాగంలో 1.94 రెట్లు, రిటైల్‌ విభాగంలో 1.94 రెట్లు, క్యూఐబీ 2.83 రెట్లు, ఎన్​ఐఐ 2.8 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్‌, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 రాయితీ ఇచ్చారు.

ఎల్​ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ధరల శ్రేణిని 902-949 రూపాయలుగా ప్రకటించారు. పాలసీదార్లకు రూ.60, రిటైల్‌ మదుపర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున రాయితీ దక్కింది. 30 కోట్ల వరకు పాలసీదార్లు, 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఎల్​ఐసీకి మొత్తం బీమా ప్రీమియంలో 64 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 2019-20లో 5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్‌ రికార్డు సృష్టించింది. ఇందులో ఎల్​ఐసీకి 3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది. ఆర్థిక నిపుణులు, మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఎల్​ఐసీ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందని సూచిస్తున్నారు. మదుపర్లు ఏమాత్రం తొందరపడొద్దని దీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. బీమా రంగంలో ఉన్న ఇతర ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఎల్​ఐసీ భవిష్యత్తులో చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

జోరుగా స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం సెషన్​లో స్టాక్​మార్కెట్లు పుంజుకున్నాయి. 53,285 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ 942 పాయింట్లు లాభపడి 53,916 వద్ద ట్రేడవుతోంది. గరిష్ఠంగా 53,918ను తాకిన సెన్సెక్స్​.. 53,176 కనిష్ఠాన్ని నమోదు చేసింది. టాటాస్టీల్, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్​టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

మరోవైపు నిఫ్టీ సూచీలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. 15,912 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 283 పాయింట్లు లాభపడి 16125కు చేరుకుంది. 15,900 కనిష్ఠాన్ని నమోదు చేసిన నిఫ్టీ.. ఓ దశలో అత్యధికంగా 16,132ను తాకింది. హిందాల్​కో, కోల్​ ఇండియా, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెటల్​, రియల్​ ఎస్టేట్​, ఆటో సహా అన్ని రంగాల్లో లాభాలబాట పట్టడం.. ఎల్​ఐసీ లిస్టింగ్​ అవడం మార్కెట్​పై ప్రభావం చూపాయి.

ఇదీ చూడండి : ఫిక్స్​డ్​ డిపాజిట్​పై అధిక రాబడి కావాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.