LIC Jeevan Tarun Policy : ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే పిల్లల బడి, కాలేజీ ఫీజులు కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఉన్నత చదువులు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే ప్రముఖ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మీ పిల్లల కోసం ఓ అదిరిపోయే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే ఎల్ఐసీ 'జీవన్ తరుణ్ పాలసీ'. ఈ స్కీమ్ కింద రోజుకు రూ.171లు కడితే చాలు, మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే సరికి చాలా పెద్ద మొత్తంలో డబ్బును అందుకుంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవన్ తరుణ్ పాలసీ!
LIC Jeevan Tarun Plan : జీవన్ తరుణ్ పాలసీ అనేదీ ఓ నాన్-లింక్డ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్. ఈ పాలసీలో మీరు కట్టే అమౌంట్‌పై ఎలాంటి మార్కెట్ ప్రభావం ఉండదు. కనుక దీన్ని సమ్-అష్యూర్డ్ ప్లాన్‌గా కూడా పరిగణించవచ్చు. అంటే మీరు మదుపు చేసిన డబ్బులు మళ్లీ మీ చేతికి తిరిగి వచ్చేస్తాయి. అంతేగాక ఎల్ఐసీకి వచ్చే లాభాల్లో నుంచి బోనస్‌ను కూడా పాలసీదారులకు అందుతుంది.
మీ వెసులుబాటు ఆధారంగా కట్టుకోవచ్చు!
Jeevan Tarun Benefits : ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లపై తీసుకోవచ్చు. ఇందులో మదుపు చేయడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు మనీ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇది మీ పిల్లల చదువులకు సంబంధించిన అవసరాలతో పాటు, ఆడపిల్లల పెళ్లి ఖర్చులను కూడా తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ప్రీమియంను మన వెసులుబాటుకు అనుగుణంగా కట్టుకోవచ్చు. అంటే నెల, మూడు, ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి చెల్లించవచ్చు. ( Best LIC Policy For Children )
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకోవాలంటే మీ పాప లేదా బాబు వయసు కనీసం మూడు నెలలు లేదా 90 రోజులు ఉండాలి. గరిష్ఠంగా 12 ఏళ్ల వరకు వారి పేరుపై ఈ పాలసీని తీసుకోవచ్చు. కాగా, ఈ పాలసీని కనిష్ఠంగా రూ.75 వేల మొత్తానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి గరిష్ఠ పరిమితులు లేవు. అంటే మీ స్తోమత ఆధారంగా ప్లాన్ విలువను పెంచుకోవచ్చు.
లోన్ కూడా పొందవచ్చు!
Best LIC Plan For Child : జీవన్ తరుణ్ ప్లాన్ తీసుకుంటే.. మీ పిలలకు 25 ఏళ్ల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. అంతేగాక ఎప్పుడైనా అవసరమైతే.. ఈ ప్లాన్‌పై లోన్ కూడా తీసుకోవచ్చు.
పాలసీ ముఖచిత్రం!
LIC Plans For 25 Years : ఈ ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ మెచ్యూరిటీ గడువును 25 ఏళ్లుగా ఫిక్స్ చేశారు. కాగా, ఇందులో చివరి 5 ఏళ్లకు ఎటువంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల టెన్యూర్‌తో ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు మీరు కేవలం 20 ఏళ్లు ప్రీమియం కడితే సరిపోతుంది.
Jeevan Tarun LIC Policy Details With Example : ఉదాహరణకు మీ పిల్లలు పుట్టిన ఏడాదిలోపే వారి పేరు మీద జీవన్ తరుణ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఆ పాలసీ టర్మ్ వచ్చేసి 24 ఏళ్లుగా ఉంటుంది. అంటే మీరు 19 ఏళ్ల పాటు మాత్రమే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీ చిన్నారికి 2 ఏళ్లప్పుడు మీరు పాలసీ తీసుకుంటే గనుక వారికి 23 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే మీరు కేవలం 18 ఏళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.
మెచ్యురిటీ సమయానికి ఎంత వస్తుంది?
Jeevan Tarun LIC Policy Benefits : మీ పాప లేదా బాబుకు 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు.. ఏడాదికి రూ.62,415 ప్రీమియంను చెల్లించే విధంగా జీవన్ తరుణ్ ప్లాన్‌ను తీసుకున్నారనుకుందాం. అప్పుడు మీరు రోజుకు కేవలం రూ.171 కడితే చాలు. దీని ప్రకారం 18 ఏళ్లలో మీరు రూ.10.89 లక్షలను ప్రీమియంగా చెల్లిస్తారు. దీనికి ఎల్ఐసీ అదనంగా బోనస్ కింద యాడ్ చేస్తుంది. అంటే మీ పిల్లలకు 25 ఏళ్లు నిండగానే ఎల్ఐసీ దాదాపు రూ.28.24 లక్షలను ఏకమొత్తంగా అందిస్తుంది.
- LIC Aadhaar Shila Policy : ఎల్ఐసీ 'సూపర్ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్‌డ్రా!
- LIC Jeevan Kiran : ఎల్ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్! మరెన్నో బెనిఫిట్స్ కూడా!
- LIC New Jeevan Shanti Plan : ఎల్ఐసీ నయా ప్లాన్.. జీవితాంతం ఏటా రూ.1,42,508 పెన్షన్.. అర్హతలు ఇవే!
- How to Apply LIC Kanyadan Policy : కూతురు వివాహానికి ఎల్ఐసీ అద్భుత పాలసీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి.. లక్షల్లో లబ్ధి పొందండి.!