LIC Jeevan Anand Policy Benefits : ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వారికి, మన తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక లోటు ఉండకూడదంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే మార్కెట్‌లో అనేక కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ని కంపెనీలు ఉన్న చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో బీమాను తీసుకోవడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకం అలాంటిది మరి. ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ వినియోగదారుల భద్రత, భవిష్యత్తుపై భరోసా కల్పించేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకువచ్చింది. ఇది ఒక లైఫ్ టైమ్ ఎండోమెంట్ ప్లాన్. ఈ పాలసీలో పెట్టుబడి పెడితే రక్షణ కూడా ఉంటుంది. కేవలం రోజుకు రూ.45 లను పెట్టుబడిగా పెట్టి రూ.25 లక్షల వరకు బెన్‌ఫిట్స్ పొందే.. జీవన్ ఆనంద్ పాలసీ పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
LIC Jeevan Anand Policy Benefits in Telugu : ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ప్రయోజనాలిలా..
మెచ్యూరిటీ బెనిఫిట్ : పాలసీ మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారుడు జీవించి ఉంటే మొత్తం డబ్బును ఒకేసారి అందిస్తారు. పెద్ద మొత్తంలో ఒకేసారి రూ.25 లక్షలు మీ వద్ద ఉంటే, ఇది మీ భవిష్యత్తుకు ఆర్థిక బాసటగా నిలుస్తుంది.
పాలసీదారుడు మరణిస్తే: ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకున్న పాలసీ హోల్డర్ ఒకవేళ మరణిస్తే, అతనిపై ఆధారపడిన కుటుంబానికి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. అప్పుడు బీమా మొత్తం, బోనస్ ఎఫ్‌ఏబీ ఒకేసారి కలిపి ఇస్తారు.
ఎల్‌ఐసీ షేరుల్లో : ఈ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకున్న వారికి ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఎల్‌ఐసీ షేరుల్లో వచ్చే వాటలో కొంత సొమ్మును జీవన్ ఆనంద్ పాలసీని తీసుకున్న వారికి అందిస్తారు.
ట్యాక్స్ మినహాయింపు : ఈ జీవన్ ఆనంద్ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి పన్ను చెల్లింపులో మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీరు పన్నును ఆదా చేయాలనుకుంటే ఇది మీకు మంచి పాలసీ అని గుర్తుంచుకోండి. ఈ రోజే ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తుకు మీరే భరోసా కల్పించుకోండి.
LIC Policy Jeevan Anand పాలసీలో రోజుకు రూ. 45తో రూ. 25 లక్షలు పొందడమెలా అంటే..
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ప్రీమియం అన్ని వర్గాల వారు చెల్లించే విధంగా అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్నట్లయితే మినిమమ్ సమ్ అష్యూర్డ్ 5 లక్షల రూాపాయలుగా ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 35 సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ తీసుకుంటే మీ చేతికి రూ. 25లక్షలు వస్తాయి. ఈ జీవన్ ఆనంద్ పాలసీలో చేరిన వారు ఏడాదికి రూ. 16,300 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,358 చెల్లించాలన్న మాట. దీని ప్రకారం మీరు రోజుకు రూ.45 ప్రీమియంగా చెల్లించాలి. ఇలా చెల్లిస్తే మెచ్యూరిటీ పీరియడ్ తరవాత పాలసీదారుడికి ఒకేసారి రూ.25 లక్షలను చేతికి అందిస్తారు. అందులో బోనస్ రూ.8 లక్షలు, ఎఫ్‌ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి. అలాగే ఇందులో పాలసీ మెచ్యూరిటీ తరవాత కూడా లైఫ్ కవర్ కొనసాగుతుంది.