ETV Bharat / business

20 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌.. త్వరలో కియా విద్యుత్తు కారు.. - కియా మోటార్స్​ న్యూస్​

Kia Motors New Electric Vehicle: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్​ తన ఈవీ6 విద్యుత్తు కారును దేశీయ విపణిలోకి త్వరలో ఆవిష్కరించనుందని తెలుస్తోంది. మరోవైపు జపాన్‌ వాహన దిగ్గజం హోండా కార్స్‌ మన దేశంలోకి హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశ పెడుతోంది. కొత్త సెడాన్‌ మోడల్‌ 'సిటీ ఇ:హెచ్‌ఈవీ'ని గురువారం ఆవిష్కరించింది.

honda city hybrid
kia motors electric vehicle
author img

By

Published : Apr 15, 2022, 5:01 AM IST

Kia Motors New Electric Vehicle: విద్యుత్తు కార్ల విపణిలో పోటీ పెరిగిపోతోంది. ఈ విభాగంలో దేశీయంగా టాటా మోటార్స్‌ అగ్రస్థానంలో ఉండగా, ఇతర వాహన కంపెనీలూ తమ మోడళ్లను ఆవిష్కరించేందుకు తొందరపడుతున్నాయి. ఈ రేసులోకి టయోటా, కియా కంపెనీలు వస్తున్నాయి. టయోటా మోటార్స్‌ ఇటీవల ప్రపంచ విపణిలోకి బీజడ్‌4ఎక్స్‌ పేరుతో తమ తొలి విద్యుత్తు ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ వాహనాన్ని మనదేశంలోనూ ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. కియా మోటార్స్‌ తన ఈవీ6 విద్యుత్తు కారును దేశీయ విపణిలోకి త్వరలో ఆవిష్కరించనుందని తెలుస్తోంది. ఈ కారును ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో కియా మోటార్స్‌ విడుదల చేసింది. మనదేశంలో ప్రవేశపెట్టేందుకు విస్తృత స్థాయిలో 'ట్రయల్స్‌' నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు నెలల్లో దేశీయంగా ఈ కారు విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కియా ఈవీ6.. 'క్రాస్‌ఓవర్‌' ఎస్‌యూవీ తరగతి వాహనం. దాదాపు 4.7 మీటర్ల పొడవుండే ఈ వాహనం వెడల్పూ ఎక్కువేనని తెలుస్తోంది. 3 రకాల బ్యాటరీ ప్యాక్‌లతో ఎంతో త్వరగా ఛార్జ్‌ అయ్యే సదుపాయంతో, ఐదు మోడళ్లలో దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. 20 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జింగ్‌ అయ్యే సదుపాయం కూడా ఈ కారుకు ఉందని సమాచారం. తన మాతృ సంస్థ అయిన హ్యూందాయ్‌ మోటార్స్‌కు చెందిన లోనిక్‌ 5 మోడల్‌కు వినియోగించిన ఇ-జీఎంపీ ఆర్కిటెక్చర్‌ను ఈవీ6 కారు కోసం కియా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ఈ కారును పూర్తిగా కొరియా నుంచి దిగుమతి చేసుకుని, మనదేశంలో విక్రయిస్తారని, తదుపరి మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. దేశీయంగా ఉత్పత్తి చేపట్టే అంశాన్ని పరిశీలిస్తారని చెబుతున్నారు. ఈ విద్యుత్తు వాహనం ధర రూ.50-60 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.

honda city hybrid
హోండా హైబ్రిడ్​

హోండా సిటీ హైబ్రిడ్‌ విద్యుత్తు వాహనం: జపాన్‌ వాహన దిగ్గజం హోండా కార్స్‌ మన దేశంలోకి హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశ పెడుతోంది. కొత్త సెడాన్‌ మోడల్‌ 'సిటీ ఇ:హెచ్‌ఈవీ'ని గురువారం ఆవిష్కరించింది. ఈ కారుకు ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించిన సంస్థ.. వచ్చే నెలలో విపణిలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సిటీ మోడల్‌ వాహనాలకు ఇది పొడిగింపు అని కంపెనీ చెబుతోంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో స్వీయ ఛార్జింగ్‌ టూ-మోటార్‌ హైబ్రిడ్‌ వ్యవస్థను అనుసంధానించారు. కొత్త కారు గరిష్ఠంగా 126 పీఎస్‌ శక్తిని, లీటర్‌కు 26.5 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. వైడ్‌ యాంగిల్‌తో ముందు కెమేరా, ప్రమాదాలను నిరోధించే లేదా తీవ్రతను తగ్గించే ఫార్‌ రీచింగ్‌ డిటెక్షన్‌ వ్యవస్థ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈకారులో ఉన్నాయి. దేశంలో కొత్త తరం విద్యుత్‌ మోడళ్లలో కంపెనీ ప్రయాణం మొదలు కానుందని హోండా కార్స్‌ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ టకుయా త్సుమురా పేర్కొన్నారు. వాహనాలు ఢీకొనకుండా నివారించే బ్రేకింగ్‌ వ్యవస్థ, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, రోడ్‌ డిపార్చర్‌ మిటిగేషన్‌, ఒక వరుసలో వెళ్లేందుకు సహకరించే వ్యవస్థ, ఆటో హైబీమ్‌ వంటి సదుపాయాలు ఇందులో కల్పించారు. రాజస్థాన్‌లోని తపుకారాలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో సిటీ ఇ:హెచ్‌ఈవీ కార్లను ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 30 విద్యుత్తు వాహన మోడళ్లను ఆవిష్కరించాలన్నది సంస్థ ప్రణాళిక.

ఇదీ చదవండి: వాహన బీమా తీసుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.