Key Things To Keep In Mind While Taking A Two Wheeler Loan : ఫైనాన్స్‌లో టూ-వీలర్ కొనాలనుకునేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ వస్తుందని ఏది పడితే అది కొనుగోలు చేయకూడదు. అందుకే టూ-వీలర్ లోన్ కోసం ప్రయత్నించే ముందు చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక స్థోమత
How To Buying A Bike On A Budget : టూ-వీలర్ ఫైనాన్స్ తీసుకునే ముందు, సకాలంలో ఆ రుణాన్ని తీర్చే ఆర్థిక స్థోమత మీకు ఉందా? లేదా? అనేది గుర్తించుకోవాలి. అలాగే మీ జీతం, ఖర్చులు, ఇప్పటికే ఉన్న EMIలు, వడ్డీ రేట్లు అన్నీ లెక్కవేసుకోవాలి. ప్రస్తుతం కొనాలనుకుంటున్న వాహనానికి డౌన్‌పేమెంట్ సిద్ధం చేసుకోవాలి. కొత్తగా కొనే వాహనంతో మన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాలి.
ధరను దృష్టిలో పెట్టుకోండి
How To Compare Bike Prices Properly : ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మోడళ్ల టూ-వీలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని వాహనాల ధర ఒకేలా ఉండదు. కానీ ప్రస్తుతం, ఏ వాహనానికైనా ఫైనాన్స్ చేసేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తాయి. వాటిలో నుంచి ఒక మంచి దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), ఇతర సంస్థలు ఆఫర్ చేస్తున్న రుణాలు, వడ్డీ రేట్లను పరిశీలించాలి. ప్రాసెసింగ్ ఫీజు, EMI నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైనాన్స్ కంపెనీలు రకరకాల స్కీమ్‌లను అందిస్తూ ఉంటాయి. వాటిలో ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోవాలి.
సిబిల్ స్కోర్ ఆధారంగా..
How Much CIBIL Score Is Required For Bike Loan : సిబిల్ స్కోర్ ఆధారంగానే ఫైనాన్స్ కంపెనీలు రుణాలు మంజూరు చేస్తాయి. తిరిగి చెల్లింపుల్లో తేడాలొస్తే సిబిల్ స్కోర్ బాగా తగ్గిపోతుంది. అందుకే లోన్ మంజూరు విషయంలో సిబిల్ స్కోర్/ క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. అందుకే రుణదాత నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మన క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోవాలి.
లోన్ టెన్యూర్ అండ్ ఈఎంఐ
Two Wheeler Loan Tenure and EMI : మీ ఆర్థిక స్థోమతను అనుసరించి రుణ కాలవ్యవధిని నిర్ణయించుకోవాలి. ఎక్కువకాలం నెలవారీ EMIలను చెల్లించేలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ విధానం వల్ల వడ్డీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీ ఆదాయ, వ్యయాలకు తగ్గట్టుగా కొత్త టూ-వీలర్ EMI ఉండేలా చూసుకోవాలి.
డాక్యుమెంటేషన్
How To Check Two Wheeler Documentation : రుణాలు తీసుకునే ముందు డాక్యుమెంట్ పూర్తిగా చదవండి. డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఆలస్యంగా చేసే చెల్లింపులపై విధించే పెనాల్టీలు, అదే విధంగా ముందస్తు చెల్లింపుల షరతులు.. ఇలా అన్ని వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
డౌన్ పేమెంట్, ఇతర ఖర్చులు
Two Wheeler Down Payment : లోన్ మొత్తం, EMI భారం తక్కువగా ఉండాలంటే.. డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇన్సూరెన్స్, వాహన రిజిస్ట్రేషన్, సర్వీసింగ్ ఖర్చులను లెక్కవేసుకోవాలి. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఎమౌంట్‌లోనే ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా చెల్లిస్తాయి. కనుక అలాంటి వాటిని పోల్చి చూసుకోని.. మంచి దానిని ఎంచుకోవాలి.
తిరిగి చెల్లించేవిధానం
Two Wheeler Loan Repayment Process : టూ-వీలర్ లోన్స్ తీసుకునే ముందు.. ముందుస్తు చెల్లింపులు, పెనాల్టీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఒక వేళ ముందస్తు చెల్లింపులపై పెనాల్టీలు లేకపోతే.. ప్రీ పేమెంట్ చేసి వడ్డీల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
ఆర్థిక ప్రణాళిక
Best Financial Planning Tips : టూ-వీలర్ ఫైనాన్స్ తీసుకునే ముందు.. అత్యవసర ఆర్థిక పరిస్థితులు, కొనుగోళ్లు, పెట్టుబడుల కోసం మీరు చేసిన పొదుపుపై, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోండి.
బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న టాప్-7 కార్స్ ఇవే! స్టార్ రేటింగ్, ఎయిర్ బ్యాగ్స్ లెక్క ఇలా!
కొత్త బండి కొనాలా? టాప్ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!