ETV Bharat / business

సెన్సెక్స్@70,000; నిఫ్టీ@21,000 - విజయ ప్రస్థానం మొదలైంది ఇలా! - sensex all time high record details

Journey Of Sensex From 1000 To 70000 In Telugu : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ @70,000; నిఫ్టీ@21,000 వద్ద ఆల్​ టైమ్​ హై లెవెల్స్​ క్రాస్ చేశాయి. అందుకే కేవలం 100 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​, 1000 వద్ద మొదలైన నిఫ్టీల.. విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

timeline of Nifty from 1000 to 21000
Journey of Sensex from 1000 to 70000
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 1:58 PM IST

Journey Of Sensex From 1000 To 70000 : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్​ సూచీ సెన్సెక్స్​ మొదటిసారిగా 70,000 లెవెల్​ను క్రాస్ చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ తాజాగా 21,000 వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. ఈ విజయ ప్రస్థానం వెనుక పెద్ద చరిత్రే ఉంది.

విజయ ప్రస్థానం
Timeline Of Sensex From 100 To 70000 :

  • 1979లో 100 వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్​.. ఈ 2023 డిసెంబర్​ నాటికి 70,000కు చేరుకుంది. అంటే గత 44 ఏళ్లలో సెన్సెక్స్ మదుపరులకు​ 700 రెట్లు లాభాలను పంచిపెట్టింది.
  • బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్​ సూచీ సెన్సెక్​ 1990లో మొదటిసారిగా 1000 లెవెల్​ను క్రాస్ చేసింది. అక్కడి నుంచి నేటి వరకు ఈ విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
  • మాజీ ప్రధాని డాక్టర్​ మన్మోహన్ సింగ్ భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చిన తరువాత.. దేశ పురోభివృద్ధి మరింత ముందుకు సాగింది. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాయి.

దూకుడు పెరుగుతోంది!

  • సెన్సెక్స్​ 100 నుంచి 1,000 లెవెల్​ను క్రాస్ చేయడానికి 11 ఏళ్లు పట్టింది. ఈ కాలంలో మదుపరులకు 23.3 శాతం చొప్పున వార్షిక​ రాబడి (CAGR) లభించింది.
  • సెన్సెక్స్​ 2006 ఫిబ్రవరిలో మొదటిసారి 10,000కు చేరింది. అంటే సెన్సెక్స్​ 1,000 నుంచి 10,000 లెవెల్​ను క్రాస్ చేయడానికి 16 ఏళ్లు పట్టింది. ఈ 16 ఏళ్లలో మదుపరులకు 15.5 శాతం చొప్పున వార్షిక​ రాబడి (CAGR) లభించింది.
  • సెన్సెక్స్​ 2007 అక్టోబర్​లో 20,000 అత్యున్నత శిఖరాన్ని తాకింది. అంటే కేవలం 21 నెలల్లోనే రెట్టింపు అయ్యింది.

ఆర్థిక సంక్షోభం..

  • ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా సెన్సెక్స్​ 30,000 లెవెల్​ చేరడానికి సుమారుగా 7 సంవత్సరాలు పట్టింది.
  • సెన్సెక్స్ 2019 మే నెలలో​ 40,000 లెవెల్​ను క్రాస్ చేసింది. అంటే 30,000 నుంచి 40,000 లెవెల్​ను చేరడానికి కేవలం 4 ఏళ్లు మాత్రమే పట్టింది.
  • సెన్సెక్స్​ 40,000 నుంచి 50,000 చేరడానికి కేవలం 17 నెలలే పట్టింది.

కొవిడ్ దెబ్బకు విలవిల

  • కొవిడ్ మహమ్మారి విజృంభించిన తరువాత 2020 మార్చిలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్రమైన నష్టాలకు గురయ్యాయి. దీనితో సెన్సెక్స్​ 35 శాతం కరెక్షన్​ను గురై 25,700 లెవెల్​కు పడిపోయింది. దీనితో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది.

తగ్గేదేలే!

  • కొవిడ్ భయాలు తెరమరుగైన తరువాత దేశీయ స్టాక్​ మార్కెట్లు మళ్లీ విజృంభించాయి. సెన్సెక్స్​ 2021 జనవరిలో 50,000 మార్కును దాటితే.. 2021 సెప్టెంబర్​లోనే 60,000 లెవెల్​ను దాటింది. అంటే కేవలం 8 నెలల్లోనే భారీ లాభాలతో సెన్సెక్స్ దూసుకుపోయింది.
  • తాజాగా 2023 డిసెంబర్​లో సెన్సెక్స్ జీవన కాల గరిష్ఠం 70,000 లెవెల్​ను క్రాస్ చేసింది.
  • ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి 1990లో స్టాక్​ మార్కెట్​లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. నేడు అది 7 కోట్ల రూపాయలు అయ్యుండేది.

నిఫ్టీ ఎపిక్​ బుల్ రన్
Timeline Of Nifty 50 From 1000 To 21000 :​

  • జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూజీ నిఫ్టీ కేవలం 28 ఏళ్లలోనే 1000 నుంచి 21,000 లెవెల్​ను చేరుకుంది. ఈ విజయ ప్రస్థానం ఎలా కొనసాగిందంటే..
  • నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 1995లో బేస్ వాల్యూ 1000తో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.
  • నిఫ్టీ 2017 జులై 26న 10,000 లెవెల్​ను దాటింది. అంటే నిఫ్టీ 1000 నుంచి 10,000 లెవెల్​ను చేరడానికి 21 సంవత్సరాలు పట్టింది.
  • నిఫ్టీ 2023 సెప్టెంబర్​ నాటికి 10,000 నుంచి 20,000 లెవెల్​ను క్రాస్​ చేసింది.
  • తాజాగా 2023 డిసెంబర్​ 12న నిఫ్టీ 21,000 లెవెల్​ను దాటి ఆల్​టైల్ హై రికార్డ్​ను నెలకొల్పింది. అంటే 10,000 నుంచి 21,000 లెవెల్​ చేరడానికి కేవలం 6 సంవత్సరాల 4 నెలల సమయం మాత్రమే పట్టింది. అంటే మదుపరుల సంపద ఈ ఆరేళ్లలో విపరీతంగా పెరిగింది. ఈ విధంగా దేశీయ స్టాక్ మార్కెట్ల విజయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

క్రెడిట్ స్కోర్​ తగ్గిందా? ఈ సింపుల్​ టిప్స్​తో పెంచుకోండిలా!

వారానికి 70 గంటలు పనిచేస్తే - ధనికులయ్యేది ఉద్యోగులా? యజమానులా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.