ETV Bharat / business

ఉమ్మడి బ్యాంక్ ఖాతా వాడుతున్నారా? వివాదాలు వస్తే ఏం చేయాలి? - ఉమ్మడి బ్యాంకు ఖాతా వల్ల జరిగే సమస్యలు

జాయింట్ బ్యాంక్ అకౌంట్​తో కొన్ని ప్రయోజనాలు ఉన్నా.. పలు సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి బ్యాంకు ఖాతాలతో ఏర్పడిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

joint bank accounts disadvantages
joint bank accounts disadvantages
author img

By

Published : May 8, 2023, 5:21 PM IST

సాధారణంగా కుటుంబ సభ్యులు పొదుపు కోసం లేదా ఏదైన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్య సాధన కోసం జాయింట్ బ్యాంకు​ అకౌంట్​లను తెరుస్తారు. వ్యాపార భాగస్వాములు అయితే వ్యాపార నిర్వహణ కోసం ఉమ్మడి బ్యాంకు ఖాతాలను ఓపెన్‌ చేస్తారు. ఇతర రెగ్యులర్‌ ఖాతాల మాదిరే ఇక్కడా పొదుపు ఖాతాతో పాటు లోన్‌ అకౌంట్‌, మార్జిగేజ్‌ అకౌంట్‌ ఇలా కొన్ని రకాల ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా ప్రారంభించేందుకు భాగస్వామ్యులు ఇద్దరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, జాయింట్ అకౌంట్​తో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. అవేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

తలెత్తె ఇబ్బందులు..
జాయింట్​ అకౌంట్​ కలిగిన వారిలో ఇద్దరిలో ఒకరికి ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉంటే అప్పుడు సమస్యలు మొదలవుతాయి. అనేక కారణాల వల్ల.. ఇతరత్రా భావోద్వేగాల వల్ల ఎవరైనా అకౌంట్​లోని డబ్బులను ఖాళీ చేయొచ్చు. అందుకే ఉమ్మడి ఖాతాను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. అయితే ఇరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తితే జాయింట్​ అకౌంట్​ సమస్యాత్మకంగా మారుతుంది. ఇద్దరి మధ్య నెలకొనే ఏదో ఒక వివాదం జాయింట్‌ ఖాతాలో నిధుల నిర్వహణను కష్టతరం చేస్తుంది. అలాంటప్పుడు ఖాతాదారులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. పరస్పరం అంగీకరించే విధానాన్ని ఎంచుకొని పరిష్కారానికి ప్రయత్నించాలి. బ్యాంకుల్లో ఉమ్మడి ఖాతా నిధులపై వివాదం తతెత్తితే పరిస్థితిని చక్కదిద్దడానికి కింది దశలను అమలు చేయొచ్చు. అవేంటంటే?

మధ్యవర్తి సాయం..
వివాదాన్ని ఇరువురు సామరస్యంగా పరిష్కరించుకోకపోతే.. మధ్యవర్తి సాయం తీసుకోవడం మంచిది. స్నేహితుడు గానీ, కుటుంబానికి చెందిన మరో వ్యక్తి గానీ ఇక్కడ మధ్యవర్తిగా వ్యవహరించొచ్చు. ఇలా సమస్యను పరిష్కరించుకోవాలి.

న్యాయ నిపుణుల సలహా..
మధ్యవర్తిత్వం విఫలమైతే.. న్యాయ సలహా కోరడం అవసరం కావచ్చు. వివాదానికి సంబంధించి చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి అవకాశాలను అన్వేషించడానికి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ చట్టాల్లో నైపుణ్యం కలిగిన న్యాయవాదిని సంప్రదించడం ఉత్తమం.

బ్యాంకునే ఆశ్రయిస్తే..
బ్యాంకును ఆశ్రయించడం చివరి అవకాశం కావచ్చు. ఉమ్మడి ఖాతా ఒప్పందానికి సంబంధించి నిబంధనలు, షరతుల ఆధారంగా బ్యాంకు మీ ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంది లేదా నిధులను విభజిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది చట్టపరమైన చర్యలను కలిగి ఉంటుంది. పైగా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. కాబట్టి వివాద పరిష్కారంలో బ్యాంకును ఆశ్రయించడం అనేది ఆఖరి ప్రయత్నమై ఉండాలి.

బ్యాంకు స్టేట్‌మెంట్‌ చెక్​ చేసుకోండి..
మీ బ్యాంకు అకౌంట్​ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఈ స్టేట్‌మెంట్లను మీరు ఎప్పుడు పొందారో చెక్‌ చేయండి. ఈ విధంగా మీరు ఏదైనా లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా వివాదం లేదా నిధుల మళ్లింపు విషయంలో మీరు దాన్ని రుజువుగా కూడా ఉపయోగించవచ్చు. బ్యాంకులో నిధులు ఉపసంహరించిన ప్రతిసారీ మీ ఫోన్‌/ఈ-మెయిల్‌కు మెసేజ్‌ వస్తుంది. మీకు తెలియకుండా జరిగిన లావాదేవీల గురించి వెంటనే బ్యాంకుకు తెలియజేయడం చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతాలో నిధులు ఉమ్మడిగా ఉంటాయి. వివాదం ఏర్పడితే అది రెండు పార్టీల సమ్మతితో, ఖాతాకు సంబంధించిన నిబంధనలు, షరతులతో నిర్వహించగలిగేలా ఉండాలి.

పారదర్శకత..
జాయింట్ అకౌంట్​ నిధుల నిర్వహణకు పార్టీల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌, పారదర్శకత, పరస్పర విశ్వాసం అవసరం. ప్రతి వ్యక్తి ఖాతాకు ఎంత జమ చేస్తారు? ఉమ్మడి ఖాతా నుంచి ఏ ఖర్చులు చెల్లిస్తారో చూసుకోవాలి. అన్ని లావాదేవీల రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. మీ సమ్మతి లేకుండా జరిగిన ఏదైనా లావాదేవీని ట్రాక్‌ చేయడంలో ఇది మీకు బాగా సాయపడుతుంది.

అకౌంట్ బ్లాక్​..
ఒకవేళ మీ అనుమతి లేకుండా ఉపసంహరణలు కొనసాగితే లేదా నిధులు సురక్షితంగా ఉండవని మీరు విశ్వసిస్తే, వెంటనే ఖాతాను స్తంభింపజేయమని బ్యాంకును కోరవచ్చు. ఈ విషయంలో, బ్యాంకు రెండు పార్టీల అనుమతి తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ మాత్రమే ఖాతాను బ్లాక్‌ చేయగలరు. అయితే, ఇది జాయింట్ అకౌంట్​లకు సంబంధించిన బ్యాంకు నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.