Jio Rs 4498 Prepaid Plan : దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవలే అతి ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.4498 విలువైన ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌కాల్స్, రోజుకు 100 SMS ప్రయోజనాలతోపాటు 14+ OTT సబ్స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. రిలయన్స్ జియో ఈ మధ్యకాలంలో అనేక కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అందులో అత్యంత ఖరీదైన ప్లాన్ ఇది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఇదే.
రూ.4498 విలువైన ఈ ప్లాన్‌లో 14 OTT ఛానల్స్ వీక్షించొచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో సాధారణంగా లేని అనేక ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా కల్పిస్తోంది జియో. అపరిమిత 5G డేటా కూడా ఈ ప్లాన్ ద్వారా జియో అందిస్తోంది.
జియో రూ.4498 ప్లాన్
రూ.4498 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు, రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. అదే విధంగా రోజుకు 2GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కి తగ్గిపోతుంది. అత్యంత ఖరీదైన ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 365 రోజులు. నెలనెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందిపడేవారు ఈ జియో ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. రూ.4498 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. కనుక సగటున నెలకు రూ.374 పడుతుందని భావించొచ్చు.
OTT ప్రయోజనాలు ఎన్నో..
జియో రూ.4498 ప్లాన్‌తో 14+ OTT ఛానల్స్ సబ్స్క్రిప్షన్స్ లభిస్తాయి. వాటిలో సోనీలివ్, జీ5, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్కవరీ ప్లస్, సన్NXT, కంచా లంక, ప్లానెట్ మరాఠీ, చౌపల్, డాక్యుబే, ఎపిక్ఆన్, హోయ్ చోయ్, లయన్స్ గేట్ ప్లే లాంటి పలు ఓటీటీలను ఆస్వాదించొచ్చు. అంతేకాకుండా జియో టీవీ, జియో క్లౌడ్ లాంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మినహా మిగిలిన అన్ని ఓటీటీలు JioTV ప్రీమియం కిందకు వస్తాయి.
ఎక్స్ట్రా బెనిఫిట్స్!
ఈ ప్లాన్ తీసుకున్నవారికి అదనంగా జియో కస్టమర్ కేర్ టీం నుంచి ప్రయారిటీ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాదు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. జియో ప్రైమ్ వీడియో మొబైల్ వీడియో కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. రిడీమ్ కూపన్ మైజియో అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. అయితే డిస్నీ+హాట్‌స్టార్ చూడాలని అనుకునేవారు, జియో నంబర్‌తోనే లాగిన్ కావాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్ - రూ.202కే 13+ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్!
మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే?