ETV Bharat / business

అన్​లిమిటెడ్ 5G డేటా, 365 డేస్ వ్యాలిడిటీ- అత్యంత చీప్​గా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ - జియో రిపబ్లిక్ డే ఆఫర్

Jio Recharge Republic Day Offer 2024 : రిపబ్లిక్​ డే సందర్భంగా అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్​ ప్రకటించింది రిలయన్స్ జియో. అత్యంత చీప్​గా కొత్త ప్లాన్​ను తీసుకొచ్చింది. అదే ప్లాన్​కు అదనంగా మరిన్ని ఆఫర్లు అందిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు మీకోసం.

Jio Recharge Republic Day Offer 2024
Jio Recharge Republic Day Offer 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:35 PM IST

Jio Recharge Republic Day Offer 2024 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏడాది కాలపరిమితి కలిగిన రూ.2,999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌పై పలు కూపన్లు డిస్కౌంట్లు అందిస్తోంది. స్విగ్గీ, అజియో వంటి సంస్థల ఉత్పత్తులపై కూపన్స్, వయా ఇక్సిగో ద్వారా బుక్​ చేసిన ఫ్లైట్​ టిక్కెట్లపై డిస్కౌంట్స్​, ఇక ఎంపిక చేసిన రిలయన్స్ డిజిటల్ వస్తువులు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. జనవరి 15 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.

జియో అందిస్తున్న రూ.2,999తో రీఛార్జి చేసుకునే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 మెసేజ్​లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు. రిలియన్స్​ డిజిటల్​లో 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అయితే రూ.5000లకు పైగా విలువగల వస్తువులపై మాత్రమే ఈ ఆఫర్​ ఇస్తున్నారు. ఈ ఆఫర్​ ప్రకారం రూ.లక్ష విలువ గల వస్తువు ఏదైనా కొనుగోలు చేస్తే, దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అజియోలో రూ.2,499 పైగా షాపింగ్‌ చేస్తే రూ.500 డిస్కౌంట్‌ వస్తుంది. ఆన్‌లైన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ ప్లాట్‌ఫామ్‌ తిరాలో రూ.1000, అంత కంటే ఎక్కువ మొత్తంలో చేసే కొనుగోళ్లపై 30శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక్సిగోలో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. ఇక ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్​ఫామ్ స్విగ్గీ ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.125 విలువైన రెండు డిస్కౌంట్‌ కూపన్లు రీఛార్జి ద్వారా లభిస్తాయి. రిలయన్స్‌ డిజిటల్‌లో రూ.5వేల కొనుగోలుపై 10శాతం రాయితీ ఉంటుంది. ఈ ప్లాన్‌ను మై జియో యాప్‌/ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు.

JIO Bharat Amazon : 'జియో భారత్​' సేల్స్​ ప్రారంభం.. రూ.999కే అమేజింగ్ ఫీచర్స్​తో 4జీ ఫోన్​!

వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.