ETV Bharat / business

జియో పోస్ట్​పెయిడ్ కొత్త ప్లాన్స్​ ఇవే.. ఓ సారి చూసేయండి.. - జియో ఓటీటీ

JIO POST PAIDPLANS: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో.. పోస్ట్​పెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది. రూ.399 మొదలుకొని వివిధ రకాల ఓటీటీలతో కూడిన పోస్ట్​పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటో ఓ సారి చూసేయండి..

Jio post paidplans
జియో
author img

By

Published : Apr 30, 2022, 4:47 AM IST

JIO POST PAIDPLANS: కొత్తగా మొబైల్‌ ప్లాన్‌ కోసం చూస్తున్నారా? డేటా, ఆన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు ఓటీటీ సేవలనూ ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే ప్రముఖ టెలికాం సంస్థ జియో అందిస్తున్న పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై ఓ లుక్కేయండి. రూ.399 మొదలుకొని వివిధ రకాల ఓటీటీలతో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల వివరాలు..

  • జియో (RELIANCE JIO) అందిస్తున్న పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో రూ.199లతో వస్తున్న ప్యాక్‌ అత్యంత బేసిక్‌ ప్లాన్‌. దీంట్లో ఒకనెల కాలపరిమితితో 25 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. వివిధ జియో యాప్స్‌ (JIO Apps)ని వినియోగించుకోవడానికి అనుమతి ఉంటుంది.
  • ఒక్క రూ.199 ప్లాన్‌ తప్ప మిగతా అన్ని జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల (JIO Postpaid Plans)తో అదనంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా వస్తుండడం విశేషం. రూ.399తో నెలకు 75 జీబీ డేటా, తర్వాత ప్రతి 1జీబీకి రూ.10 చెల్లించాలి. ఈ ప్యాక్‌లో 200 జీబీ డేటా రోల్‌ఓవర్‌ కూడా ఉంది. అంటే ఈ నెలలో ఖర్చుకాని డేటా వచ్చే నెలకు బదిలీ చేసుకోవచ్చు. అలాగే అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు రానే వస్తాయి.
  • ప్లాన్‌ రూ.599 ద్వారా నెలకు 100 జీబీ డేటా, 200 జీబీ రోల్‌ ఓవర్‌ అందిస్తోంది. 100 జీబీ వినియోగం తర్వాత ప్రతి 1 జీబీకి రూ.10 చెల్లించాలి. అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అదనంగా ఒక జియో సిమ్‌ని కూడా పొందొచ్చు.
  • రూ.799 ప్లాన్‌లో రెండు అదనపు సిమ్‌లను అందిస్తారు. నెలకు 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్‌ఓవర్‌ అందుబాటులో ఉన్నాయి. 150జీబీ తర్వాత రూ.10 చెల్లించి 1 జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి.
  • జియోలో అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ (Postpaid Plans) రూ.999 ప్యాక్‌. దీంట్లో అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు.. నెలకు 200 జీబీ డేటా వస్తుంది. 500 జీబీ డేటా రోల్‌ఓవర్‌ కూడా ఉంది. 200 జీబీ డేటా ఖర్చయిన తర్వాత రూ.10 చెల్లించి ఒక్క జీబీ డేటా పొందొచ్చు. అదనంగా ఫ్యామిలీ ప్యాక్‌తో కూడిన మూడు సిమ్‌లను అందిస్తారు.
  • ఒక్క రూ.199 ప్లాన్‌ తప్ప మిగిలిన అన్ని జియో పోస్ట్‌పెయిడ్‌ పథకాల్లో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video), డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ HOTSTAR) సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో ఏడాది సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే ఫీచర్లన్నీ అందుబాటులో ఉండడం విశేషం.

ఇదీ చదవండి: మరో ప్రభుత్వ సంస్థ విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.