ETV Bharat / business

Jio Plan Offers 2023 : జియో ఇండిపెండెన్స్​ డే ఆఫర్​.. రూ.2,999 ప్లాన్​పై డబుల్​ బెనిఫిట్స్​! - independence day 2023 recharge plan offers

Jio Plan Offers 2023 : రిలయన్స్ జియో ఇండిపెండెన్స్​ డే 2023 ఆఫర్​ ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.2,999 రీఛార్జ్​ ప్లాన్​పై ఈ ఆఫర్​ ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్లాన్​ ద్వారా లభించే డేటా, కాలింగ్​ బెనిఫిట్స్​, డిస్కౌంట్స్​ సహా వివిధ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reliance Jio Independence Day 2023 offer on Rs 2999 plan
Jio Recharge Offers 2023
author img

By

Published : Aug 11, 2023, 12:38 PM IST

Jio Plan Offers 2023 : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్​ జియో తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్​ను ప్రకటించింది. రూ.2,999 వార్షిక రీఛార్జ్​ ప్లాన్​పై రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే 2023 ఆఫర్​ (Reliance Jio Independence Day 2023 offer) అందిస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా అదనపు డేటా, కాలింగ్​ బెనిఫిట్స్​ సహా అనేక ఇతర ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఫుడ్​ డెలివరీ సర్వీసెస్​ ఉపయోగించినప్పుడు, ట్రావెల్​ రిజర్వేషన్స్​, ఆన్​లైన్​ షాపింగ్​ చేసేటప్పుడు అదిరిపోయే డిస్కౌంట్స్ లభిస్తాయని స్పష్టం చేసింది.

జియో ఆఫర్​ వివరాలు
Jio 2999 Plan Details 2023 : రిలయన్స్ జియో రూ.2,999 వార్షిక రీఛార్జ్​ ప్లాన్​ను తీసుకుంటే, ప్రతిరోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. దీనిని మొత్తంగా చూసుకుంటే, సంవత్సరానికి 912.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ రూ.2,999 రీఛార్జ్​ ప్లాన్​ ద్వారా ఏడాది మొత్తం అపరిమిత వాయిస్​ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు చొప్పున వాడుకోవచ్చు.

జియో - డిస్కౌంట్స్​
Jio 2999 Plan Benefits 2023 : జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్​ 2023 కింద ఈ రూ.2,999 వార్షిక ప్లాన్ (Reliance Jio Independence Day 2023 offer) తీసుకున్నవారికి చాలా మంచి డిస్కౌంట్స్​ లభిస్తాయి.

  • స్విగ్గీలో రూ.249 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు ఉన్న ఫుడ్​ ఆర్డర్​ చేస్తే, రూ.100 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.
  • యాత్రా.కామ్​లో ఫ్లైట్​ రిజర్వేషన్​ చేసుకుంటే రూ.1500 వరకు డిస్కౌంట్​ అందిస్తారు.
  • యాత్రా.కామ్​ వెబ్​సైట్​లో దేశీయంగా హోటల్​ బుకింగ్​ చేస్తే.. 15 శాతం వరకు లేదా రూ.4000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.
  • Ajioలో రూ.999 విలువైన కొన్ని ఎంపిక చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే, రూ.200 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.
  • Netmedsలో రూ.999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు.. NMS సూపర్​క్యాష్​తో పాటు, ఆ ఆర్డర్​పై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • వినియోగదారులు రిలయన్స్ డిజిటల్​ స్టోర్​లో ఆడియో ప్రోడక్ట్స్​ లేదా గృహోపకరణాలు కొనుగోలు చేస్తే.. నేరుగా 10 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.

రూ.2,999 ప్లాన్​​.. రెడీమ్​ చేసుకోవడం ఎలా?
How To Redeem Jio plan Benefits :

  • స్టెప్​ 1 : యూజర్లు ముందుగా తమ స్మార్ట్​ఫోన్​లో MyJio యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలి.
  • స్టెప్​ 2 : యాప్​లోని రీఛార్జ్​ టాబ్​ను ఓపెన్​ చేసి రూ.2,999 వార్షిక ప్లాన్​ను ఎంచుకోవాలి.
  • స్టెప్ 3 : మీరు ఈ రీఛార్జ్​ ప్లాన్​ను ఏ జియో ఫోన్​ నంబర్​ కోసం తీసుకుంటున్నారో.. దానిని ఎంచుకోవాలి.
  • స్టెప్​ 4 : యూపీఐ/ నెట్​ బ్యాంకింగ్​ / బ్యాంక్​ కార్డ్స్ ఉపయోగించి ఆన్​లైన్​ పేమెంట్​ చేయాలి.
  • స్టెప్​ 5 : పేమెంట్ అయిపోయిన తరువాత, మీరు కోరుకున్న ఫోన్ నంబర్​కు ఈ రూ.2,999 వార్షిక ప్లాన్​ చేరుతుంది.

నోట్​ : వాస్తవానికి మీ ప్రస్తుత జియో ప్లాన్​ అయిపోయిన తరువాత, లేదా మీకు నచ్చినప్పుడు ఈ రూ.2,999 రీఛార్జ్​ ప్లాన్​ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రిలయన్స్​ జియో ఇండిపెండెన్స్​ డే 2023 ఆఫర్ (Reliance Jio Independence Day 2023 offer)​ కేవలం ప్రీపెయిడ్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.