ETV Bharat / business

జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌ - ఆ ప్లాన్‌పై ఏకంగా 24 డేస్ ఎక్స్​ట్రా వ్యాలిడిటీ! - best mobile recharge plans 2023

Jio New Year Offer 2024 In Telugu : జియో యూజర్లు అందరికీ గుడ్​ న్యూస్​. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో రిలయన్స్ జియో ఇప్పటికే ఉన్న ఓ ప్రీపెయిడ్​ ప్లాన్​పై అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది. ఓటీటీ లవర్స్ కోసం కూడా పలు సూపర్ ప్లాన్​లను అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

jio special ott plans
Jio New Year Offer 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 5:58 PM IST

Jio New Year Offer 2024 : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా న్యూ ఇయర్ ఆఫర్​ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టనున్న తరుణంలో, ఏడాది కాలపరిమితితో ఉన్న ఓ రీఛార్జ్ ప్లాన్​పై 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్​​ 2024' పేరిట అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ యూజర్లు అందరికీ ఇప్పటికే ఈ ఆఫర్​ అందుబాటులోకి వచ్చింది. అందుకే లాంగ్ టర్మ్ ప్లాన్​ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ప్లాన్​పై ఓ లుక్కేస్తే బెటర్.

Jio Rs 2999 Plan Validilty : రిలయన్స్ జియో రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్​ను 365 రోజుల వ్యాలిడిటితో అందిస్తోంది. అయితే న్యూ ఇయర్ ఆఫర్​ కింద, ఈ ప్లాన్ తీసుకున్నవారికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ ఓచర్​ను ఇస్తోంది. అంటే రూ.2999 రీఛార్జ్​ ప్లాన్​ను సబ్​స్క్రైబ్​ చేసుకున్నవారు ఏకంగా 389 రోజులపాటు దానిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట.

Jio Rs 2999 Plan Benefits : ఈ రిలయన్స్ జియో రూ.2999 ప్లాన్​ తీసుకున్నవారికి అపరిమిత వాయిస్​కాల్స్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు లభిస్తాయి. అలాగే రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున 365 రోజులకు 912 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా లిమిట్​ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్​ 64 kbpsకు తగ్గిపోతుంది.

ఈ రిలయన్స్ జియో రూ.2999 ప్లాన్​ను రీఛార్జ్​ చేసుకున్నవారు జియో క్లౌడ్​, జియో టీవీ, జియో సినిమాలను ఏడాది పాటు ఉచితంగా ఆస్వాదించవచ్చు. అయితే జియో సినిమా ప్రీమియం మాత్రం ఇందులో ఉండదు. ఎలిజిబిలిటీ ఉన్న యూజర్లకు అన్​లిమిటెడ్​ 5జీ డేటా కూడా లభిస్తుంది.

జియో ఓటీటీ ప్లాన్స్
ఓటీటీ లవర్స్ కోసం జియో ప్రత్యేకమైన ప్లాన్​లను అందిస్తోంది. అవి :

  1. జియో రూ.4498 ప్లాన్​ : ఈ వన్ ఇయర్ ప్లాన్​లో 14 ఓటీటీ ప్లాట్​ఫాంల సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది. పైగా రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున అందుతుంది. ఈ ప్లాన్​లో అమెజాన్​ ప్రైమ్ వీడియో మొబైల్​, డిస్నీ+హాట్​స్టార్​, సోనీ లివ్​, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్​గేట్​ ప్లే, డిస్కవరీ+, ఎపిక్ ఆన్​, సన్​ NXT, డాక్యుబే, హోఇచోయ్​​, చౌపాల్​, ప్లానెట్ మరాఠీ, కంచ లంకా ఓటీటీల సబ్​స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
  2. జియో రూ.1198 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటితో వచ్చే ఈ ప్లాన్​లోనూ 14 ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్ పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా చొప్పున అందుతుంది. ఈ ప్లాన్​ తీసుకున్నవారు అమెజాన్​ ప్రైమ్ వీడియో మొబైల్​, డిస్నీ+హాట్​స్టార్​, సోనీ లివ్​, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్​గేట్​ ప్లే, డిస్కవరీ+, ఎపిక్ ఆన్​, సన్​ NXT, డాక్యుబే, హోఇచోయ్​​, చౌపాల్​, ప్లానెట్ మరాఠీ, కంచ లంకా ఓటీటీల కంటెంట్​ను ఉచితంగా చూడవచ్చు.
  3. జియో రూ.398 ప్లాన్ : 28 రోజుల వ్యాలిడితో వచ్చే ఈ ప్లాన్​లో 12 ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ సబ్​స్క్రిప్షన్ పొందవచ్చు.​ ఈ ప్లాన్​ తీసుకున్న యూజర్లు సోనీ లివ్​, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్​గేట్​ ప్లే, డిస్కవరీ+, ఎపిక్ ఆన్​, సన్​ NXT, డాక్యుబే, హోఇచోయ్​​, చౌపాల్​, ప్లానెట్ మరాఠీ, కంచ లంకా ఓటీటీల కంటెంట్​ను ఉచితంగా చూడవచ్చు.

దేశంలోనే అత్యంత ఖరీదైన​ ప్లాన్ - 14+ ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్​ & సూపర్​ బెనిఫిట్స్​!

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు గురించి తెలుసుకోవాలా? UDGAM పోర్టల్​లో చెక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.