Jet Airways Owner Arrested : జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను అక్రమ నగదు చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది.
నరేశ్ గోయల్, అతని భార్య అనిత, మాజీ జెట్ ఎయిర్‌వేస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు రూ.538 కోట్లు మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నరేశ్ గోయల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ముంబయిలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను ప్రాథమిక విచారణ చేసింది.
కస్టోడియల్ రిమాండ్!
Jet Airways Founder Naresh Goyal Arrested : ఈడీ ఇవాళ (సెప్టెంబర్ 2)న నరేశ్ గోయల్‌ను ముంబయిలోని స్పెషల్ PMLA కోర్టు ముందు హాజరుపరచనుంది. తదుపరి విచారణ చేయడం కోసం కస్టోడియల్ రిమాండ్‌ను కోరే అవకాశం ఉంది.
రుణాలు ఎగవేశారు!
Naresh Goyal In Bank Fraud Case : కెనరా బ్యాంకు.. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్‌కు రూ.848.86 కోట్ల మేర రుణాలను, క్రెడిట్ లిమిట్స్‌ను మంజూరు చేసింది. అయితే నరేశ్ గోయల్ ఆధ్వర్యంలోని జెట్ ఎయిర్‌వేస్ కేవలం రూ.310 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించిందని, మిగతా రూ.582.62 కోట్లు పూర్తిగా ఎగవేసిందని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది.
2021లోనే ఫ్రాడ్ జరిగింది!
Naresh Goyal Moneylander Case : 'నరేశ్ గోయల్ జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.1,410.14 కోట్లను.. ఇతర కంపెనీలకు అక్రమంగా మల్లించినట్లు.. ఆ కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విధంగా నరేశ్ గోయల్ అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారు' అని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. దీనితో 2021 జులైలోనే సీబీఐ నరేశ్ గోయల్ (ఫ్రాడ్) 'మోసానికి' పాల్పడినట్లు కేసు నమోదు చేసింది.
సొంత అవసరాల కోసం కంపెనీ సొమ్ము!
'జెట్‌ఎయిర్‌వేస్ ముఖ్యంగా నరేశ్ గోయల్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖర్చులను చెల్లించింది. అలాగే గోయల్ కుటుంబానికి చెందిన సిబ్బంది జీతాలు, ఫోన్ బిల్లులు, వాహనాల ఖర్చులు కూడా జెట్ ఎయిర్‌వేస్ చెల్లించింది. ఇలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం' అని ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది.
పెట్టుబడులు, అడ్వాన్స్‌ల రూపంలో!
Jet Airways Latest News : జెట్ ఎయిర్‌వేస్.. అడ్వాన్స్‌లు, పెట్టుబడుల రూపంలో అక్రమంగా ఇతర కంపెనీలకు డబ్బులు బదిలీ చేసిందని సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నరేశ్ గోయల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.