ETV Bharat / business

ITR Verification : ఇన్​కం టాక్స్ రీఫండ్​ కావాలా?.. ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ తప్పనిసరి.. గడువు 30 రోజులే!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 1:29 PM IST

ITR Verification : ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసిన వారు 30 రోజుల్లోగా కచ్చితంగా ఈ-వెరిఫికేషన్ చేసుకోవాలని ఇన్​కం టాక్స్ డిపార్ట్​మెంట్ స్పష్టం చేసింది. లేదంటే దానిని ఇన్​వాలీడ్​ (చెల్లని) ఐటీఆర్​ ఫైలింగ్​గా పరిగణిస్తామని వెల్లడించింది. పైగా పైనాల్టీ కూడా విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలు చూద్దాం.

E verification of ITRs is mandatory
ITR Verification

ITR Verification : ఆదాయపన్ను శాఖ.. ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ను తప్పనిసరి చేసింది. ఐటీఆర్​ దాఖలు​ చేసిన తరువాత 30 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్​ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులకు స్పష్టం చేసింది.

ఈ-వెరిఫై చేసుకోకపోతే!
Is E Verification Of ITR Mandatory : ఒక వేళ మీరు ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత.. ఈ-వెరిఫికేషన్​ చేసుకోకపోతే.. ఫైలింగ్ ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లు పరిగణిస్తారు. అలాగే దానిని ఇన్​వాలీడ్ (చెల్లని) ఐటీఆర్​ ఫైలింగ్​గా గుర్తిస్తారు.

పెనాల్టీ కూడా!
ITR Penalty : ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు కీలకమైన సూచన చేసింది. వీలైనంత త్వరగా ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. లేకుంటే గడువు మీరిన తరువాత పెనాల్టీ (జరిమానా) విధించే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

  • Dear Taxpayers,

    Complete the e-filing process today!

    Please find below the modes of e-verification of return.
    Remember to verify your ITR within 30 days of filing. Delayed verification may lead to levy of late fee in accordance with provisions of the Income-tax Act, 1961.… pic.twitter.com/bu7jrXLFNH

    — Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డియర్​ టాక్స్ పేయర్స్​.. ఇవాళే ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ ప్రక్రియను పూర్తి చేయండి. గుర్తుంచుకోండి! ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లో ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గడువులోగా ఈ-వెరిఫికేషన్ చేసుకోకపోతే.. ఇన్​కం టాక్స్ యాక్ట్​-1961 ప్రకారం, మీపై ఆలస్య రసుము (పెనాల్టీ) విధించే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఈ రోజే ఐటీఆర్​ వెరిఫికేషన్​ పూర్తి చేయండి."
- ఇన్​కం టాక్స్ డిపార్ట్​మెంట్​ ట్వీట్​

ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్ ఎందుకు చేయాలి?
ITR E Verification Is Necessary : ఆదాయపన్ను రిటర్నులు చెల్లుబాటు కావాలంటే, కచ్చితంగా ఈ-వెరిఫికేషన్​ తప్పనిసరి. ఇన్​కం టాక్స్​ డిపార్ట్​మెంట్​ 2023 ఆగస్టు నుంచి ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది.

ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ చేసుకోవడం ఎలా?
ITR E-Verification Process :

  • ముందుగా ఆదాయపన్ను శాఖకు చెందిన e-filing పోర్టల్​ను ఓపెన్ చేయాలి.
  • పోర్టల్​లో e-verify return లింక్​పై క్లిక్ చేయాలి.
  • పాన్​ నంబర్​, అసెస్మెంట్​ ఇయర్ (2023-24)​, రసీదు సంఖ్యను నమోదు చేయాలి. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా..
  • పోర్టల్​లో మీ పాన్​, పాస్​వర్డ్​తో లాగిన్ కావాలి.
  • పోర్టల్​లోని My Account సెక్షన్​లోకి వెళ్లి, e-verify return ఆప్షన్​పై క్లిక్ చేయాలి. దీనితో ఓ సరికొత్త వెరిఫికేషన్​ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు మీరు ఆధార్​ ఓటీపీ ఎంటర్​ చేసి ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందు కోసం మీ రిజిస్టర్ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేసి, ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేయాలి.
  • ఇంతకంటే సులువుగా ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసే మార్గం మరొకటి ఉంది. మీరు నేరుగా నెట్​ బ్యాంకింగ్ పోర్టల్​కు వెళ్లి, ఐటీఆర్​ సెగ్మెంట్​లో ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేసుకోవచ్చు.

రీఫండ్​ టైమ్​ తగ్గింపు
Income Tax Refund Processing Time : ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు.. టాక్స్ రీఫండ్ అందించే సమయాన్ని బాగా తగ్గించే దిశగా ప్లాన్​ చేస్తోంది. ప్రస్తుతం 16 రోజుల వ్యవధిలో ఐటీఆర్ రీఫండ్​ అందిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ రీఫండ్​ వ్యవధిని 10 రోజులకు తగ్గించాలని ఆదాయపన్ను శాఖ ఆలోచిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.