ITR Revalidation Status Check Online : దేశంలో లక్షల మంది ట్యాక్స్ పేయర్లు తమ ఐటీఆర్ రీఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 6 కోట్ల మంది ఖాతాదార్ల ఫైలింగ్‌లను ప్రాసెస్ చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT).. మిగతా వాటిని కూడా ప్రాసెస్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే వాటిని వెరిఫై చేసి ప్రాసెస్ చేయాలంటే ముందుగా మనం(పన్ను చెల్లింపుదారులు) తమ తమ బ్యాంకు ఖాతాల వివరాలను అప్డేట్ లేదా రీ-వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాతనే మీ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడే మీకు రావాల్సిన రీఫండ్ మీకు తిరిగి వస్తుంది. కాగా, ఐటీఆర్‌లు ఫైల్ చేసిన వారు తప్పకుండా తమ బ్యాంకు ఖాతాల వివరాలను మళ్లీ అప్డేట్ లేదా రీ-వ్యాలిడేట్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తాజాగా 'X'(ట్విట్టర్) వేదికగా సూచించింది.
ITR Filing 2023 : ఐటీఆర్ రీఫండ్ రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ వివరాలను ప్రీ-వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా వ్యాలిడేట్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను పన్ను చెల్లింపుదారులు.. సాధారణంగా ఈవీసీ (ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్)ను ఎనేబుల్ చేసుకునేందుకు వాడవచ్చు. అలాగే ట్యాక్స్ రిటర్న్స్, ఇ-ప్రొసీడింగ్స్, రీఫండ్ రీ-ఇష్యూస్, పాస్వర్డ్ రీసెట్స్, ఇ-ఫైలింగ్ కోసం.. ఇలా రకరకాలుగా ఉపయోగించవచ్చు. అందువల్లనే వ్యాలిడేట్( Revalidation Of Bank Account In ITR ) చేసిన బ్యాంకు వివరాలను మరోసారి అప్డేషన్ లేదా రీ-వ్యాలిడేట్ చేసుకోమని అధికారులు సూచిస్తున్నారు. మరి మన బ్యాంకు డీటెయిల్స్‌ను అప్డేట్ లేదా రీ-వ్యాలిడేట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా http://incometax.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత మీ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లండి.
- అనంతరం 'My Bank Account'పై క్లిక్ చేయండి.
- చివరగా 'రీవ్యాలిడేట్' లేదా 'యాడ్ బ్యాంక్ అకౌంట్' అని అప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- ఈ వ్యాలిడేషన్ రిక్వెస్ట్‌కి సంబంధించిన వివరాల స్టెటస్‌ను మీ మొబైల్ నంబర్‌తో పాటు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపిస్తారు.
దీనితో మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరలా అప్డేట్ లేదా రీవ్యాలిడేట్ అవుతాయి. అంటే సంబంధిత బ్యాంక్ మీ గుర్తింపును ధ్రువీకరిస్తుంది. ఇది మీరు దాఖలు చేసిన ఐటీఆర్ త్వరగా ప్రాసెస్ అయ్యి వీలైనంత త్వరగా మీ రీఫండ్ మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
'Failed bank account' అని చూపిస్తే ఏం చేయాలి?
ITR Revalidation Online :ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా వ్యాలిడేషన్ లేదా అప్డేషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలనే సందేహం కూడా మీకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ వివరాలన్నీ 'Failed Bank Accounts' సెక్షన్లో చూపిస్తాయి. అలాంటి సమయాల్లో ఫెయిల్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రీ-వ్యాలిడేషన్ కోసం మళ్లీ రీ-సబ్మిట్ చేయాలి. ఇందుకోసం పోర్టల్‌లోని 'Failed Bank Accounts' సెక్షన్లో 'Re-Validate' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనితో మీ 'వ్యాలిడేషన్ ప్రోగ్రెస్‌లో ఉంది' అనే స్టేటస్ మీకు కనిపిస్తుంది. ఇలా చేయడంతో మీ ఐటీఆర్ రీఫండ్ ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది.
-
Kind Attention Taxpayers!
— Income Tax India (@IncomeTaxIndia) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Your refund can only be credited into a validated bank account. So, please check bank account validation status on e-filing portal.
Pl visit https://t.co/GYvO3mRVUH ➡️ Login ➡️ Profile ➡️ My Bank Account ➡️ Revalidate/Add Bank Account
Previously… pic.twitter.com/nt80jNccxM
">Kind Attention Taxpayers!
— Income Tax India (@IncomeTaxIndia) September 5, 2023
Your refund can only be credited into a validated bank account. So, please check bank account validation status on e-filing portal.
Pl visit https://t.co/GYvO3mRVUH ➡️ Login ➡️ Profile ➡️ My Bank Account ➡️ Revalidate/Add Bank Account
Previously… pic.twitter.com/nt80jNccxMKind Attention Taxpayers!
— Income Tax India (@IncomeTaxIndia) September 5, 2023
Your refund can only be credited into a validated bank account. So, please check bank account validation status on e-filing portal.
Pl visit https://t.co/GYvO3mRVUH ➡️ Login ➡️ Profile ➡️ My Bank Account ➡️ Revalidate/Add Bank Account
Previously… pic.twitter.com/nt80jNccxM