ETV Bharat / business

ITR Filing Process : మొదటిసారిగా ఐటీఆర్ ఫైల్​ చేస్తున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

ITR Filing Process : మీరు మొదటిసారి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేద్దామని అనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లో మీరు ఎలా రిజిస్టర్​ చేసుకోవాలి? ఇందుకోసం ఏమేమి కావాలి? మొదలైన పూర్తి వివరాలు మీ కోసం..

filing income tax return for the first time here is how to get started
ITR Filing online process
author img

By

Published : Jun 28, 2023, 5:23 PM IST

ITR Filing first time : ప్రభుత్వం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ ఉంది. కానీ చాలా మంది ఇంకా ఐటీఆర్​ దాఖలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. అసలు ఐటీఆర్​ ఎలా ఫైల్​ చేయాలో వారికి తెలియకపోవడమే. ఒక వేళ మీరు కూడా ఈ లిస్ట్​లో ఉంటే.. మరేమీ చింతించకండి. ఇది మీ కోసమే.

ITR filing process : మీరు మొదటిసారిగా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేద్దామని అనుకుంటే.. అందుకు ఒక ప్రొసీజర్​ ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లో కచ్చితంగా రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పోర్టల్​లో​ మీ పేరు మీద ఒక అకౌంట్​ను క్రియేట్​ చేసుకోవాలి. తరువాత ఆదాయ పన్ను రిటర్నులను ఈ-ఫైలింగ్​ చేయాలి. అయితే 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఈ-ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. వీళ్లు ఆఫ్​లైన్​లో ఐటీఆర్​ దాఖలు చేసుకోవచ్చు.

నిపుణుల సహాయం తీసుకోవచ్చు!
ఒక వేళ మీకు స్వయంగా ఐటీఆర్​ దాఖలు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే.. ఛార్టర్డ్​ అకౌంటెంట్​ లేదా టాక్స్​ ఎక్స్​పర్ట్​ సహాయం తీసుకోవచ్చు. లేదా ప్రైవేట్​ టాక్స్​ ఫైలింగ్​ పోర్టల్స్​, మధ్యవర్తుల ద్వారా కూడా ఐటీఆర్​ ఫైల్​ చేసుకోవచ్చు.

ఐటీఆర్​ ఎవరు దాఖలు చేయాలి?
Who needs to file income tax return in India : ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా ఐటీఆర్​ దాఖలు చేయాల్సిందే. ప్రస్తుతం 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. 61 నుంచి 80 ఏళ్లలోపు వయస్సున్న వారికి రూ.3 లక్షలు; 80 ఏళ్లు వయస్సు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది.

ITR filing last date 2023 : ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 2023 జులై 31. కనుక ఇప్పటి వరకు ఐటీఆర్​ దాఖలు చేయనివారు త్వరపడడం మంచిది.

నష్టాలను కూడా రిపోర్ట్ చేయండి
How to carry forward losses in ITR :ఒక వేళ ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్థికంగా నష్టపోయినా కూడా కచ్చితంగా గడువు ముగిసే లోపు ఐటీఆర్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఈ సంవత్సరం వచ్చిన నష్టాలను, తదిపరి సంవత్సరాల్లో వచ్చే ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.

మీ క్రెడిట్ కార్డు బిల్లులు, విదేశీ పర్యటనల ఖర్చు.. పరిమితికి మించి ఉన్నా కూడా ఐటీఆర్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నా, లేదా విదేశాల నుంచి ఆదాయాన్ని సంపాదించి ఉన్నా కూడా కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ-ఫైలింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి?
How to register ITR online : కొత్తగా ఐటీఆర్​ ఫైల్​ చేద్దామని అనుకునే వాళ్లు ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి.

  • స్టెప్​ 1 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​ https://www.incometax.gov.in/iec/foportal/ ను ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 2 : న్యూ యూజర్​ - రిజిస్టర్​ టాబ్​పై క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 3 : 10 అంకెల పర్మినెంట్​ అకౌంట్​ నంబర్​ (పాన్​) ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 4 : పాన్​ వెరిఫికేషన్​ అయిన తరువాత, 'వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు​'గా నిర్ధరణ చేసుకోవాలి.
  • స్టెప్​ 5 : పాన్​ కార్డులో ఉన్న విధంగా మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. మీ పేరు, ఇంటి పేరు, లింగం, చిరునామా తదితర వివరాలు ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 6 : మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్​ అడ్రస్​ ఎంటర్​ చేయాలి. వీటి ద్వారా వెరిఫికేషన్​ ప్రక్రియ జరుగుతుంది.
  • స్టెప్​ 7 : ఫోన్ నంబర్​, ఈ-మెయిల్​ ఇచ్చిన తరువాత 'పాస్​వర్డ్' సెట్​ చేసుకోమని అడుగుతుంది. ఇందుకోసం మీ మొబైల్​, ఈ-మెయిల్​కు రెండు ఓటీపీలు వస్తాయి. వీటిని సరిగ్గా ఎంటర్​ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అవుతుంది.

భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్​ను ఏర్పాటు చేసుకోండి
వాస్తవానికి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చాలా సున్నితమైన, ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మీ పాన్​, ఆధార్​ నంబర్లు, బ్యాంకు ఖాతా సమాచారం, టాక్స్​ మినహాయింపులు, గత ఆదాయ పన్ను రిటర్నులు మొదలైన విలువైన సమాచారం ఉంటుంది. వీటి వివరాలు ఇతరులకు తెలిస్తే.. చాలా సమస్యలు వస్తాయి. అందుకే భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్​ను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఈ-ఫైలింగ్​ వాల్ట్​ ఎనేబుల్​ చేసుకోవడం వలన.. అకౌంట్​లోకి లాగిన్ అయ్యే ప్రతిసారీ ఓటీపీ వస్తుంది. దీని వల్ల ఇతరులు ఎవ్వరూ అనధికారికంగా మన ఖాతాను యాక్సిస్​ చేయకుండా నిరోధించవచ్చు.

ఈ-వాల్ట్​ ఫెసిలిటీ ఎనేబుల్​ చేసుకోవడానికి.. ముందుగా 'ప్రొఫైల్​ సెట్టింగ్స్​'లోకి వెళ్లాలి. తరువాత 'ఈ-ఫైలింగ్ వాల్ట్​- హైయ్యర్​ సెక్యూరిటీ' ఆప్షన్​ను ఎంచుకోవాలి. మరింత భద్రత కోసం నెట్​ బ్యాంకింగ్​, డిజిటల్​ సిగ్నేచర్​ సర్టిఫికేట్​లను యాక్సెస్​ చేయడానికి ఆధార్​ లింకేజీతో ఓటీపీ జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్​ ఎంచుకోవాలి.

అదనపు సమాచారం అప్​డేట్ చేసుకోవచ్చు
భద్రతా ప్రమాణాలు అన్నీ ఎనేబుల్​ చేసుకున్న తరువాత, 'యువర్ ప్రొఫైల్​' సెక్షన్​లోకి వచ్చి, మీ వ్యక్తిగత వివరాలు అన్నీ మళ్లీ సరిచూసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త సమాచారం ఉన్నా.. దానిని అప్​డేట్​ చేసుకోవచ్చు. లేదా ఉన్న సమాచారాన్ని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అలాగే ఆదాయ పన్ను శాఖ నుంచి మీకు వచ్చే రిఫండ్​ ఏ బ్యాంకు అకౌంట్​లో జమ చేయాలో కూడా మీరు ఇక్కడే నిర్ధరించవచ్చు.

  • వాస్తవానికి ఆదాయ పన్ను శాఖ పోర్టల్​లో మీ డీమ్యాట్​ అకౌంట్ వివరాలు, డిజిటల్​ సిగ్నేచర్​ సర్టిఫికేట్ వివరాలు కూడా నమోదు చేసుకోవచ్చు. కానీ ఇలా నమోదు చేయడం తప్పనిసరేమీ కాదు.
  • ఒక వేళ మీరు ఐటీఆర్​ దాఖలు చేయడానికి.. ఛార్టర్డ్ అకౌంటెంట్​ లేదా మధ్యవర్తి సహాయం తీసుకోవాలని అనుకుంటే.. వారి వివరాలు కూడా ఈ ఖాతాలో పొందుపరచవచ్చు.
  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ ఖాతాను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఇతర వ్యక్తులను మీ ప్రతినిధులుగానూ చేర్చుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇతరుల ఖాతాను పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు వారి అనుమతి కూడా పొందవచ్చు.

చాలా ఉపయోగాలు ఉన్నాయి
Benefits of ITR filing : ఆదాయపన్ను శాఖ వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐటీఆర్​ దాఖలు చేయడమే కాదు.. మునుపటి పన్ను రిటర్నులు, ఫారమ్ 26ఏఎస్​, యాన్యువల్​ ఇన్ఫర్మేషన్​ స్టేట్​మెంట్​ (ఏఐఎస్​)లను కూడా డౌన్​లోడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఐటీఆర్​/ఫారమ్​ల ధ్రువీకరణ, ఈ-ప్రొసీడింగులు, ఆధార్​ ద్వారా ఇన్​స్టంట్​​ పాన్​ (ఈ-పాన్​) పొందవచ్చు. అలాగే ఆదాయ పన్ను సంబంధిత సైబర్​ నేరాలపై ఫిర్యాదు చేసి, పరిష్కారం కూడా పొందవచ్చు.

మరీ ముఖ్యంగా రిఫండ్​ ప్రాసెసింగ్​, లోపాల సవరణ, కరెక్షన్​ ఆఫ్​ డిమాండ్​, అప్పీల్​ ఆర్డర్స్​, పాన్​ సంబంధిత దరఖాస్తులు, అస్సెసింగ్​ ఆఫీసర్​ (ఏవో) వద్ద పెండింగ్​లో ఉన్న ఇతర దరఖాస్తుల సమస్యలను కూడా ఈ అకౌంట్​ ద్వారా పరిష్కరించుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.