IRCTC Zomato Tie Up : ఐఆర్‌సీటీసీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ సర్వీస్ అందించడం కోసం.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో ఇకపై రైళ్లల్లో ప్రయాణించే వారు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ముందుగానే యాప్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసిన ఫుడ్‌ను జొమాటో యాప్ సాయంతో ప్యాసెంజర్స్‌కు అందించనుంది భారతీయ రైల్వే. అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని కేవలం దేశంలోని ఐదు స్టేషన్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. మున్ముందు దీనిని మితగా రైల్వే స్టేషన్లకూ విస్తరించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఈ ఐదు స్టేషన్లలో..
IRCTC Zomato Food Delivery Tie Up : ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్ సర్వీసెస్ కింద రైలు ప్రయాణికులు ఈ సుదపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సేవల ద్వారా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా ఆర్డర్ పెట్టిన పదార్థాలను జొమాటో సాయంతో సంబంధిత స్టేషన్లకి పంపిస్తారు. అయితే ప్రస్తుతానికి 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC)' కింద ఈ ప్రయోగాన్ని దేశ రాజధాని న్యూదిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో మాత్రమే అమలు చేయనున్నారు. కాగా, ఆహారం విషయంలో ప్రయాణికులకు మరిన్ని అవకాశాలను అందించడంలో భాగంగానే జొమాటోతో కలిసి ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
వారికి ప్రత్యేక 'థాలీ..'
పండగ సీజన్ సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ ప్రత్యేక సేవలు, ఆఫర్లను ప్రయాణికుల కోసం ప్రకటించింది. దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా 'థాలీ' సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఫ్రీ-ఫుడ్ డెలివరీ..
Zomato Gold Membership : 'జొమాటో గోల్డ్'(Zomato Gold) మెంబర్‌షిప్‌తో వినియోగదారులు ఫ్రీ-ఫుడ్ డెలివరీ సదుపాయాన్ని పొందవచ్చు. జొమాటో ఇంతకు ముందు రూ.999గా ఉన్న మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఇప్పుడు కేవలం రూ.149కే అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద రూ.199 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లు చేసినవారు.. 10 కిలోమీటర్ల పరిధిలోపు ఉండే రెస్టారెంట్ల నుంచి ఉచిత ఫుడ్ డెలివరీని పొందవచ్చు.
Hyderabad to Shirdi IRCTC Tour Package : షిరిడీ వెళ్తున్నారా..? IRCTC సూపర్ ప్యాకేజీ మీకోసం..!
How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి!