Irctc Whatsapp : దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదైనా తిందామంటే రైల్లో తయారు చేసే ఆహారం కొందరికి నచ్చదు. తర్వాత వచ్చే రైల్వేస్టేషన్‌లో తెలిసిన వారి ద్వారా బయటి నుంచి తెప్పించుకుందామా అంటే.. అవతలి వారిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని ఆగిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోకపోతే ఆ రోజు పస్తుండాల్సిందే. ఇకపై అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీకి చెందిన ఫుడ్ సర్వీస్ యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ కోసం కొత్తగా రిలయన్స్‌కు చెందిన హాప్టిక్‌తో జట్టు కట్టింది. దీని ద్వారా వాట్సాప్‌లోనే సులువుగా మీకు నచ్చిన ఆహారాన్ని మీ బెర్త్ వద్దకే అందించే సేవలకు శ్రీకారం చుట్టింది.
ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ సేవలకోసం ఎలాంటి యాప్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం వాట్సాప్ ద్వారా పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా క్యాష్ రూపంలో డబ్బులు చెల్లించొచ్చు. ఆర్డర్ రియల్‌టైమ్ స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ, విజయవాడ, వరంగల్ స్టేషన్లతో పాటు సుమారు 200కు పైగా రైల్వేస్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని రైల్వే స్టేషన్‌లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని జూప్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఆర్డర్ పెట్టాలంటే..?
వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ముందుగా మీరు +91 7042062070 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? పీఎన్‌ఆర్ చెక్ చేయాలనుకుంటున్నారా? వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫుడ్ ఆర్డర్ ఆప్షన్ ఎంచుకోగానే మీ పీఎన్‌ఆర్ వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు నమోదు చేశాక.. ఫుడ్ కావాల్సిన స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో గానీ, క్యాష్ రూపంలో గానీ చెల్లింపులు చేయొచ్చు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ స్టేటస్‌ను సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆర్డర్‌కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులున్నా చాట్‌బాట్ ద్వారా నమోదు చేయొచ్చు.
ఇవీ చదవండి: ఇకపై దిల్లీ, కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్