IPOs In November 2023 : వచ్చే వారం 5 భారీ ఐపీఓ (Initial Public Offering)లు మన ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్‌లకు సంబంధించిన మేజర్ ఐపీఓలు ఉన్నాయి. వీటితోపాటు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫ్లేర్ రైటింగ్ ఇండస్ట్రీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియాలకు చెందిన ఐపీఓలు కూడా ఈ నవంబర్లోనే వస్తున్నాయి. ఇవన్నీ కలిసి సుమారుగా రూ.7,300 కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఐపీఓ తేదీలు
IPO Dates In November 2023 :
- కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA) ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబర్ 21న ఓపెన్ అయ్యి నవంబర్ 23తో ముగియనుంది.
- మిగతా 4 సంస్థల ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది.
Upcoming IPOs 2023 :
- Tata Technologies IPO : టాటా కంపెనీ నుంచి దాదాపు 20 ఏళ్ల తరువాత వచ్చిన మొదటి ఐపీఓ ఇది. అయితే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) మాత్రమే అని ఇన్వెస్టర్లు గుర్తించుకోవాలి. ఈ ఐపీఓలో మొత్తం 6.08 కోట్ల ఈక్విటీ షేర్లు అందుబాటులో ఉండనున్నాయి. టాటా కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.475- రూ.500 వరకు నిర్ణయించింది. ఈ ఐపీఓలో అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద మొత్తంగా రూ.3,042 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
- IREDA IPO : ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ఐపీఓ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.30 - రూ.32గా నిర్ణయించింది. IREDAలోని నూటికి 100 శాతం షేర్లు భారత ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందుకే ఐఆర్ఈడీఏ 40.31 కోట్ల ఫ్రెష్ షేర్లను ఈ ఐపీఓ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26.88 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్కు ఉంచి రూ.860 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
- Fedbank Financial Services : ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్ సర్వీసెస్.. తొలిసారిగా ఐపీఓకు వచ్చింది. ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC).. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.1,092 కోట్లు, OFS ద్వారా రూ.492 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఈ ఐపీఓలో షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.133-140గా నిర్ణయించింది.
- Flair Writing Industries : పెన్నుల తయారీ సంస్థ అయిన ఫ్లేర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.593 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వీటిలో ఫ్రెష్ షేర్స్ ద్వారా రూ.292 కోట్లు, OFS ద్వారా రూ.301 కోట్లు సమీకరించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.288 - రూ.304గా నిర్ణయించింది.
- Gandhar Oil Refinery : గాంధార్ ఆయిర్ రిఫైనరీ 1.79 కోట్ల ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేసి రూ.302 కోట్లు, OFS ద్వారా 1.18 కోట్లు అందించి రూ.198.69 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.160-169గా నిర్ణయించింది.
టాటా టెక్ IPOలో ఇన్వెస్ట్ చేయాలా? ఈ 10 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!