ETV Bharat / business

ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​కు​ బ్లూ టిక్.. ఎంత కట్టాలో తెలుసా..? - భారత్​లో ఫేస్​బుక్​ బ్లూ టిక్ ధర

భారత్​లో ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​.. బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ కోసం విధించే ఛార్జీలను మాతృసంస్థ మెటా వెల్లడించింది. మొబైల్​ యాప్​లకు, డెస్క్​టాప్​ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది.

instagram-and-facebook-blue-tick-cost-in-india-blue-tick-instagram-and-facebook
భారత్​లో ఫేస్​బుక్, ​ ఇంస్టాగ్రామ్​ బ్లూ టిక్ ధరలు
author img

By

Published : Mar 29, 2023, 5:37 PM IST

Updated : Mar 29, 2023, 6:41 PM IST

ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​.. భారత్​లో బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలను వెల్లడించింది. ఆ సంస్థల మాతృసంస్థ 'మెటా' బుధవారం ఈ వివరాలను ప్రకటించింది. మొబైల్​ యాప్​లకు, డెస్క్​టాప్​ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్​ యాప్​ ద్వారా ఫేస్​బుక్​ వాడితే.. నెలకు రూ. 1450 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెస్క్​టాప్​ బ్రౌజర్ల వినియోగదారులు నెలకు రూ. 1,099 చెల్లించాలని వెల్లడించింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే ఈ బ్లూటిక్​ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం మెటా వెరిఫైడ్​ సబ్​స్క్రిప్షన్​ కోసం వెయిటింగ్ లిస్ట్​లో చేరేందుకు.. భారతీయ వినియోగదారులకు ఫేస్​బుక్​ అనుమతినిచ్చింది. బ్లూటిక్​ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ యూజర్లను సంస్థ గుర్తిస్తుందని తెలిపింది. వినియోగదారులు తమ ఖాతాల రక్షణ కోసం బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ను వినియోగించుకోవాలని మెటా కోరింది. ఇప్పటికే ట్విట్టర్​​ బ్లూటిక్​ కోసం చార్జీలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు అదే తరహాలో అడుగులు వేసిన మెటా.. బ్లూటిక్​ తీసుకువచ్చి, చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

విదేశాల్లో బ్లూటిక్​ చార్జీలు..
ఆపిల్ ఫోన్​ వినియోగదారులు నెలకు రూ.991 (11.99 అమెరికన్​ డాలర్లు), ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.1,239 (14.99 అమెరికన్ డాలర్లు) చెల్లించి వెరిఫైడ్ ఖాతాల కింద బ్లూటిక్​ను పొందాలని గతంలో మెటా తెలిపింది. అంతకుముందు మెటా బ్లూటిక్ కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేసేది కాదు. ఉచితంగానే ప్రముఖులు, వ్యాపారుల ఖాతాలకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చేది. ఈ కొత్త ఫీచర్​ను మెటా అందించే సేవల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకే తీసుకొస్తున్నామని సంస్థ తెలిపింది. గతంలో వెరిఫైడ్​ అయిన ప్రముఖులు బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ తీసుకోనవసరం లేదని తెలిపింది. కాగా మెటా దాదాపు మొత్తం ఆదాయాన్ని ప్రకటనల ద్వారానే పొందుతుంది. అయితే కొవిడ్ అనంతరం ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రకటనలు తగ్గాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం వల్ల మెటా సంస్థ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. అందుకే సంస్థను లాభాల్లో నడిపించేందుకు కొత్త నిర్ణయాలతో ముందుకొస్తుంది.

ట్విట్టర్​ బ్లూ టిక్​..
2022లో ట్విట్టర్​ కూడా బ్లూటిక్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లూటిక్​ సబ్​స్క్రిప్షన్​ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ట్విట్టర్​ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి అనుహ్య నిర్ణయాలతో సంస్థలో కీలక మార్చులు తీసుకువచ్చారు. భారీ స్థాయిలో ఉద్యోగులను సైతం తొలగించారు.

Last Updated : Mar 29, 2023, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.