సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు స్టాక్ మార్కెట్లో సోమవారం భారీగా పడిపోయాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 9.40 శాతం నష్టపోయి రూ.1,258.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీలో షేరు విలువ 9.37 శాతం తగ్గి రూ.1,185.30కి చేరుకుంది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.59,349కోట్లు క్షీణించింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడమే ఈ నష్టాలకు ప్రధాన కారణం.
అంతకుముందు.. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయంలో దాదాపు 15 శాతం మేర ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. ఓ దశలో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో 15 శాతం నష్టపోయి రూ.1,219 దగ్గర 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.73,060 కోట్లు తగ్గింది. చివరకు కాస్త కోలుకోగా.. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ షేరు విలువ 9.4శాతం పతనమైంది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి.. 59,910 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 17,706 దగ్గర ముగిసింది.
లాభనష్టాలోనివి.. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఎస్బీఐఎన్, కొటాక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాసెమ్కో, ఐటీసీ షేర్లు లాభాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
రూపాయి విలువ.. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి.. ప్రస్తుతం 81.98గా ఉంది.
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి.. ప్రస్తుతం రూ.62,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,60 పెరిగి.. ప్రస్తుతం రూ.77,520 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.62,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,360 రూపాయలుగా ఉంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,490గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,490 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.77,360 గా ఉంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.77,360 వద్ద ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2008.45 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.45 డాలర్ల వద్ద ఉంది.