ETV Bharat / business

కోపిస్టి కస్టమర్ దెబ్బకు స్టోర్​ రూమ్​లో పడుకున్న 'ఇన్ఫోసిస్'​ నారాయణ మూర్తి! - narayana murthy books

Infosys Narayana Murthy Book In Telugu : జీవితంలో ఏదైనా సాధించాలంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని తట్టుకుని నిలబడాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధించాలి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విజయం సాధించిన వ్యక్తే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఆయన విజయం వెనుక ఉన్నది ఆయన ఆర్థాంగి సుధామూర్తి. వీరి గురించి ఇటీవలే ఓ పుస్తకం విడుదల అయ్యింది. మరి ఆ పుస్తకం ఏమిటి? అందులోని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

An Uncommon Love The Early Life of Sudha and Narayana Murthy
Infosys Narayana Murthy Book in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 3:58 PM IST

Infosys Narayana Murthy Book : ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తిని ఓ అమెరికన్ క్లయింట్​ కిటీకీలు లేని స్టోర్​ రూమ్​లో పడుకునేలా చేశాడు. వాస్తవానికి అతని ఇంట్లో నాలుగు బెడ్​ రూమ్​లు ఉన్నప్పటికీ, పాతసామానులు ఉంచే స్టోర్​ రూమ్​లో నారాయణ మార్తిని ఉంచాడు. ఇన్ఫోసిస్​ సంస్థను స్థాపించిన కొత్తల్లో జరిగిన ఈ ఘటన గురించి ప్రముఖ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి తను రాసిన 'అన్​కామన్​ లవ్​: ది ఎర్లీ లైఫ్​ ఆఫ్​ సుధ అండ్ నారాయణ మూర్తి' పుస్తకంలో రాశారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి - ప్రేమ, వివాహం, పిల్లల పెంపకం సహా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపన, తొలినాళ్లలో వారు ఎదుర్కొన్న సవాళ్లు గురించి తెలుపుతూ చిత్రా బెనర్జీ ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని Jaggernaut Books ప్రచురించింది.

స్టోర్ రూమ్​లో నిద్రించిన మూర్తి
'న్యూయార్క్​లోని డేటా బేసిక్స్ కార్పొరేషన్​ హెడ్ అయిన డాన్​ లీల్స్ చాలా కోపిష్టి. అతనికి నారాయణ మూర్తి అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందుకే అతను ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బులు నారాయణ మూర్తికి ఇచ్చేవాడు కాదు. పనిపూర్తి చేసిన తరువాత కూడా సరైన సమయానికి పేమెంట్ చేసేవాడు కాదు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు మాన్​హట్టన్ వెళ్లినప్పుడు, వారికి కనీసం మంచి హోటల్​ రూమ్స్ కూడా బుక్ చేసేవాడు కాదు.

ఒకసారి నారాయణ మూర్తి అమెరికా వెళ్లినప్పుడు, డాన్ లీల్స్​ ఆయనను ఓ స్టోర్ రూమ్​లో ఉంచాడు. వాస్తవానికి అతని ఇంట్లో నాలుగు బెడ్ రూమ్​లు ఉన్నప్పటికీ, ఇలా అమానుషంగా ప్రవర్తించాడు. ఆ స్టోర్​రూమ్ నిండా పాత పెట్టెలు ఉన్నాయి. అందులోని ఓ పెద్ద పెట్టె (బాక్స్​)పై నారాయణ మూర్తి నిద్రపోయారు.

ఆ తరువాత డాన్​ లీల్స్ చెప్పిన ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కాకుండా, అతను చెప్పిన అదనపు పనులు కూడా మూర్తి పూర్తి చేయాల్సి వచ్చింది. ఇన్ఫోసిస్ సంస్థ కోసం నారాయణ మూర్తి ఇంతగా కష్టపడ్డారు. డాన్ లీల్స్ చేసిన అకృత్యాలను సహించారు. కానీ తనను స్టోర్​ రూమ్​లో ఉంచడంపై తీవ్రంగా కలత చెందారు' అని చిత్రా బెనర్జీ తన పుస్తకంలో సవివరంగా రాశారు. ఈ పుస్తకంలో ఇంకా ఏమేమి రాశారంటే?

అతిథి దేవోభవ
నారాయణ మూర్తి తనకు జరిగిన అవమానం గురించి భార్య సుధామూర్తికి చెబుతూ, "ఇంటికి వచ్చిన అతిథులను దైవంలా భావించాలని మా అమ్మ చెప్పేది. ఇంటికి వచ్చిన అతిథులతో ప్రవర్తించే విధానాన్ని అనుసరించి, అవతలి వ్యక్తులు ఎలాంటి వారో, వారి స్వభావం ఏమిటో మనం సులభంగా గుర్తించవచ్చని అనేది. ఒక్కోసారి మా నాన్నగారు ముందు చెప్పకుండా, అతిథులను ఇంటికి పిలిచేవారు. అప్పుడు మా అమ్మ తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని వారికి పెట్టేవారు. ఆమె మాత్రం పస్తులతోనే పడుకునేవారు. కానీ డాన్​ లీల్స్​ తను బెడ్​ రూమ్​లో సౌకర్యవంతంగా పడుకొని, నన్ను మాత్రం కనీసం కిటికీలు కూడా లేని, పాత సామానులు ఉంచే స్టోర్​ రూమ్​లో ఉంచారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ పాలనల వద్దు
నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడానికి డబ్బులు సాయం చేసింది స్వయాన ఆయన భార్య సుధామూర్తిగారే. ఆమె స్వయంగా మంచి ఇంజినీర్ కూడా. ఆమెకు సంస్థను నిడిపించే సామర్థ్యం ఉంది. కానీ ఆమెను సంస్థలో చేర్చుకోవడానికి నారాయణ మూర్తి ఏ మాత్రం ఇష్టపడలేదు. సుధామూర్తి స్వయంగా అడిగినా, ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. "ఐయామ్ సారీ, ఇన్ఫోసిస్​లో నీవు పనిచేయడానికి వీల్లేదు" అని కచ్చితంగా చెప్పేశారు. ఇన్ఫోసిస్ అనేది ఒక కుటుంబానికి సంబంధించిన సంస్థ కాకూడదని ఆయన భావన. వంశపారంపర్య పోకడలు, బంధుప్రీతి అనేవి వ్యాపారంలో ఉండకూడదని ఆయన ప్రగాఢంగా నమ్మేవారు. అందుకే ఆయన సుధామూర్తితో, "ఇన్ఫోసిస్ అనేది ఒక భార్యాభర్తల సంస్థగా కాకుండా, ఒక మంచి ప్రొఫెషనల్ కంపెనీగా ఉండాలి అని అనుకుంటున్నాను" అని చెప్పేశారు. కానీ, ఇటీవల నారాయణ మూర్తి దీనిపై స్పందిస్తూ, తాను అప్పట్లో తప్పుగా ఆలోచించాని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

ఇంగ్లీష్ వర్సెస్ రష్యన్​
నారాయణ మూర్తి తండ్రి ఓ సోషలిస్ట్​. అప్పట్లో జవహర్​లాల్​ నెహ్రూ కూడా యూఎస్​ఎస్​ఆర్ (రష్యా) ఆర్థిక విధానాలు అంటే చాలా ఇష్టపడేవారు. వీరి ప్రభావం నారాయణ మూర్తిపై బాగా ఉండేది. అందుకే భవిష్యత్​లో 'రష్యన్' ప్రపంచ భాష అవుతుందని ఆయన అభిప్రాయపడేవారు. ఇదే విషయాన్ని సుధామూర్తికి కూడా చెప్పేవారు. అప్పట్లో ఆయన రష్యన్ నేర్చుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాదు రష్యన్ పుస్తకాలు కూడా చాలా సేకరించేవారు.

కానీ సుధామూర్తి దీనికి భిన్నంగా ఆలోచించారు. 'ఇంగ్లీష్ మాత్రమే ప్రపంచ భాషగా వర్థిల్లుతుంది' అని ఆమె గట్టిగా వాదించారు. అయితే అప్పట్లో ఈ విషయంపై నారాయణ మూర్తి మొండి పట్టుదలతో ఉండేవారు. చాలా కాలంపాటు ఆయన రష్యన్ భాషపైనే మక్కువ చూపేవారు. కానీ చివరికి సుధామూర్తే విజయం సాధించారు.

ఒకరికి-ఒకరు ఆదర్శంగా
సుధ, నారాయణ మూర్తి ఇద్దరూ కర్ణాటకకు చెందినవారు. వారి మాతృభాష కన్నడం. ఇద్దరిదీ ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​. భార్యాభర్తలు ఇద్దరికీ పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ వారిద్దరి బాల్యం మాత్రం భిన్నంగా గడిచింది. అందుకే వారి వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా ఉంటాయి. కానీ వారిద్దరూ ఒకరి మనస్సును మరొకరు అర్థం చేసుకుని ఆదర్శంగా జీవిస్తున్నారు.

'సుధ, నారాయణ మూర్తి అనే ఇద్దరు సామాన్య వ్యక్తులు కలసి, అసాధారణ విజయాలు సాధించారు. ఒకరికి మరొకరు కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. వ్యాపారంలోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ తమదైన ముద్రవేశారు. వారు ఒకరినొకరు ఇష్టపడడమే కాదు. భారతదేశాన్ని కూడా ఎంతగానో ప్రేమించారు' అని చిత్రా బెనర్జీ తన పుస్తకంలో రాశారు.

వారానికి 70 గంటలు వర్క్ చేశా, అందుకే ఆ సలహా ఇచ్చా : నారాయణమూర్తి

వారానికి 70 గంటలు పనిచేస్తే - ధనికులయ్యేది ఉద్యోగులా? యజమానులా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.