ETV Bharat / business

మీరు 'డెబిట్‌' కార్డు వాడుతున్నారా?.. ఈ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే! - డెబిట్​ కార్డులు అప్డేట్లు

బ్యాంక్​ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా డెబిట్​ కార్డు ఉంటుంది. దాని ద్వారా ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. కొనుగోళ్ల లావాదేవీలు కూడా చేయవచ్చు. కానీ వీటిని మరింత సమర్థంగా వాడేందుకు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే?

debit card
debit card
author img

By

Published : May 13, 2023, 6:54 AM IST

ఏ బ్యాంకులో అయినా పొదుపు ఖాతా తెరిస్తే.. దాంతో పాటు మనకు అందే మరో సౌలభ్యం డెబిట్​ కార్డు. ఆ కార్డు ద్వారా మనం ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. అంతే కాకుండా కొనుగోళ్ల లావాదేవీలు చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. అయితే వీటిని మరింత సమర్థంగా వాడేందుకు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే డెబిట్​ కార్డు ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పూర్తి పొందవచ్చు.

అయితే మన బ్యాంకు ఖాతాకు అనుసంధానంగా ఉండే డెబిట్‌ కార్డును.. నగదుకు ఎలక్ట్రానిక్‌ రూపంగా చెప్పవచ్చు వ్యాపారులు, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసినప్పుడు చెల్లింపు చేసి సమయంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునేందుకూ ఇది వీలు కల్పిస్తుంది.

క్రెడిట్‌ కార్డుకు పూర్తి భిన్నంగా..
బ్యాంకు అకౌంట్​తో క్రెడిట్‌ కార్డులు అనుసంధానమై ఉండవు. ఇవి ఒక రకంగా బ్యాంకు మనకు ఇచ్చే తాత్కాలిక లోన్​. కొనుగోలు శక్తిని పెంచడంలో ఇవి సహాయం చేస్తాయి. అయితే వీటిని కాస్త జాగ్రత్తగా వాడుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు వెనక్కి, రివార్డు పాయింట్లు, రాయితీలు కూడా లభిస్తాయి. డెబిట్‌ కార్డు మాత్రం మీ ఖాతాలో ఉన్న డబ్బులు మేరకే వాడుకునేందుకు అనుమతినిస్తుంది. అంతకుమించి నిధులను మీరు వాడలేరు.

కొన్ని లిమిట్స్..
డెబిట్‌ కార్డులకు రోజువారీ ఉపసంహరణ, కొనుగోలు పరిమితులు ఉంటాయి. మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు బ్యాంకులు ఈ ఏర్పాట్లు చేస్తాయి. కొనుగోలు, ఏటీఎంల నుంచి నగదు తీసుకునేప్పుడు అసౌకర్యం కలగకుండా, ముందుగానే ఈ లిమిట్స్ గురించి తెలుసుకోవాలి.

ఛార్జీలు..
డెబిట్‌ కార్డులను ఉపయోగించి దేశంలో ఎక్కడైనా ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలను వాడినప్పుడూ పరిమితి దాటితే రుసుములు తప్పవు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసినప్పుడు మాత్రం కొన్ని నిబంధనల మేరకు రుసుములు విధిస్తారు. వీటి గురించి అవగాహన ఉండాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది.

కొన్ని ప్రత్యేక డెబిట్‌ కార్డులు ఓవర్‌డ్రాఫ్ట్‌ వెసులుబాటునూ అందిస్తాయి. ఖాతాలో నిధులు లేకపోయినా కొన్ని లావాదేవీలను పూర్తి చేసేందుకు అనుమతిస్తాయి. ఇలాంటి కార్డులు విధించే రుసుములు, వడ్డీ రేట్ల గురించి ముందే తెలుసుకుంటే మంచిది.

గమనిస్తూ ఉండాల్సిందే!
అనధికార లేదా మోసపూరిత కొనుగోళ్లను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు మీ ఖాతా వివరాలను సరిచూసుకుంటూ ఉండాలి. సంక్షిప్త సందేశాలనూ చూస్తుండాలి. మీరు చేయని లావాదేవీల గురించి సమాచారాన్ని వెంటనే బ్యాంకులకు తెలియజేయాలి. అప్పుడు నష్టపోకుండా ఉండవచ్చు.

అంతర్జాతీయంగా..
విదేశాలకు వెళ్లే ముందు మీ ప్రయాణం గురించి బ్యాంకుకు తెలియజేయండి. మీరు వెళ్తున్న దేశాల్లో కార్డును వాడేందుకు వీలు ఉందో లేదో తెలుసుకోండి. సాధారణంగా బ్యాంకులు అంతర్జాతీయ సేవలను డిఫాల్ట్‌గా నిలిపివేస్తాయి. మోసాలను నివారించేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటాయి. ఖాతాదారులు చెప్పినప్పుడే వినియోగానికి అనుమతిస్తాయి. బ్యాంక్‌ ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లోనూ దీన్ని యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

వివరాలు అత్యంత భద్రంగా!
డెబిట్‌ కార్డు వివరాలు అత్యంత రహస్యం. కార్డు వివరాలు, ఏటీఎం పిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. ఏటీఎంలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ యంత్రాలలో మీ పిన్‌ను నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కార్డు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించే స్కిమ్మింగ్‌ పరికరాలు, వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కార్డు పోతే..
ఒకవేళ డెబిట్‌ కార్డు కనిపించకపోతే వెంటనే మీ బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. సత్వర చర్యలు తీసుకుంటేనే అనధికార వినియోగాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీ డెబిట్‌ కార్డును సరైన సమాచారంతో ఉపయోగించుకునే వీలుంటుంది. అప్పుడే మోసపూరిత కార్యకలాపాల నుంచి మీ ఖాతాను రక్షించుకోవచ్చు.
-- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.