Indian Richest Women Savitri Jindal : భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరంటే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు అంబానీ, అదానీలవే. కానీ ఈ ఏడాది భారత్‌లో అత్యధిక సంపదను ఆర్జించిన వ్యక్తుల జాబితాలో జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె ఈ ఏడాది ఏకంగా 9.6 బిలియన్ డాలర్ల మేరకు సంపాదించారు. దీనితో 25.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆమె భారత్‌లోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా నిలిచారు. అంతేకాదు ఇండియాలో 5వ అత్యంత ధనికురాలిగా అవతరించారు.
వ్యాపార దక్షురాలు!
జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓంప్రకాశ్ జిందాల్ భార్యయే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం, సావిత్రి జిందాల్ - 'ఓపీ జిందాల్ గ్రూప్' ఛైరపర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ లాంటి పలు కంపెనీలు ఉన్నాయి.
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో.. ఈ జిందాల్ గ్రూప్ కంపెనీల షేర్లు అన్నీ భారీ లాభాలు ఆర్జించాయి. దీనితో సావిత్రి జిందాల్ సంపద అమాంతం పెరిగింది. ఫలితంగా భారతదేశంలోని కుబేరుల జాబితాలో ఆమె ఐదో స్థానానికి చేరుకున్నారు. అంతేకాదు భారత ఉపఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.
బాగా సంపాదించినది వీరే!
Bloomberg Billionaires Index : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, భారత్‌లో ఈ ఏడాది బాగా సంపాదించినవారిలో, హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ 8 బిలియన్ డాలర్లతో 2వ స్థానంలో నిలిచారు. రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయన సంపద 7.15 బిలియన్ డాలర్లు మేర పెరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ 6.3 బిలియన్ డాలర్ల సంపదతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
అపరకుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది కేవలం 5.2 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. అయినప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. అయితే భారత్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.
అదానీకి గండిపడింది!
హిండెన్‌బర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. దీనితో గౌతమ్ అదానీ సంపద భారీగా తగ్గిపోయింది. కానీ ఆయన ఇప్పటికీ భారత్‌లో రెండో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.
బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? ఈ టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
వర్చువల్ క్రెడిట్ కార్డ్స్‌తో ఆన్లైన్ ఫ్రాడ్స్‌కు చెక్! బెనిఫిట్స్ & లిమిట్స్ ఇవే!