India Post Click N Book Service : భారతీయ తపాలా శాఖ 'క్లిక్ ఎన్ బుక్' పేరుతో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై మీరు ఇంటి నుంచే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్స్ సహా పార్సిల్స్ను పంపించుకోవడానికి వీలవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ తపాలా శాఖ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుని.. కస్టమర్ ఫ్రెండ్లీగా, హై-టెక్ సర్వీసులను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా 'క్లిక్ ఎన్ బుక్' సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇకపై వినియోగదారులు పోస్టు ఆఫీసుకు వెళ్లకుండానే.. గరిష్ఠంగా 5 కేజీల బరువు వరకు స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్స్ను పంపించుకోవచ్చు. అయితే దీని కోసం వినియోగదారులు ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ www.indiapost.gov.in లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకోండిలా!
How To Send Parcel Through Click N Book Service :
- కస్టమర్లు Click N Book సేవలు పొందాలంటే ముందుగా www.indiapost.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- తరువాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో మీరు www.indianpost.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి స్పీడ్ పోస్టు, రిజస్టర్డ్ లెటర్స్, పార్సిల్స్ పంపించుకోవచ్చు.
- ఈ విధంగా మీరు ఇంటిలో ఉంటూనే ఒకసారికి గరిష్ఠంగా 5 లెటర్లు పంపించుకోవచ్చు. అయితే వీటి బరువు 5కేజీల లోపు మాత్రమే ఉండాలి.
ఫ్రీ పికప్ ఫెసిలిటీ!
మీరు కనుక రూ.500 వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే.. తపాలాశాఖవారు మీ పోస్టులను, లేదా పార్సిల్స్ను పూర్తి ఉచితంగా పికప్ చేసుకుంటారు. ఒక వేళ మీరు చెల్లించిన బుకింగ్ ఛార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే.. రూ.50 వరకు పికప్ ఛార్జీలు వసూలు చేస్తారు.
బుకింగ్ - పికప్ టైమింగ్స్!
Indian Post Click N Book Service Pickup Timings :
- ఉదయం 9.30 గంటలలోపు మీరు బుకింగ్ చేసుకుంటే.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు పికప్ చేసుకుంటారు.
- ఉదయం 9.30 గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలలోపు పికప్ చేసుకుంటారు.
- ఒకవేళ మీరు మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే.. మరుసటి రోజు పికప్ చేసుకుంటారు.
ప్రస్తుతానికి వారికి మాత్రమే!
ప్రస్తుతం ఈ 'క్లిక్ ఎన్ బుక్' సర్వీస్ అనేది ఉత్తర్ప్రదేశ్, ప్రయాగ్రాజ్ జిల్లాలోని ప్రయాగ్రాజ్, కచ్చరీ హెడ్ పోస్టు ఆఫీసుల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలోనే ఈ సేవలను మిగతా పోస్ట్ ఆఫీసులకు విస్తరించనున్నట్లు తపాలా శాఖ అధికారులు తెలిపారు.
తపాలా సర్వీసులు
భారతీయ తపాలా శాఖ ఇప్పటికే పలు హెడ్ ఆఫీసుల్లో సూపర్ ఆధార్ సెంటర్, పాస్పోర్ట్, డాక్ ఘర్ నిర్యత్ కేంద్ర, కామన్ సర్వీస్ సెంటర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఇది తెలుసా? పాన్కార్డ్తో పర్సనల్ లోన్ పొందవచ్చు!
అలర్ట్ - చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మారిన రూల్స్ - మీరు తెలుసుకోవాల్సిందే!