ETV Bharat / business

నెలన్నరలో 32 లక్షల వివాహాలు.. రూ.లక్షల కోట్ల ఆదాయం

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన తరుణంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) కీలక వివరాలు వెల్లడించింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే దేశంలో 32 లక్షల వివాహాలు జరగనున్నాయని తెలిపింది. దీని వల్ల దేశ వాణిజ్య వర్గాలకు భారీ ఎత్తున ఆదాయం చేకూరనుందని అంచనా వేసింది.

confederation of all india traders
వివాహాలు
author img

By

Published : Nov 7, 2022, 9:01 PM IST

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 మధ్య భారత్‌లో దాదాపు 32 లక్షల వివాహాలు జరుగుతాయని తెలుస్తోంది. దీని వల్ల రూ.3,75,000 కోట్ల వ్యాపారం జరగనుంది. సీఏఐటీకి చెందిన పరిశోధన విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు విడుదలయ్యాయి.

దేశవ్యాప్తంగా 35 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు పాల్గొనట్లు సీఏఐటీ వెల్లడించింది. ఈ సీజన్‌లో ఒక్క దిల్లీలోనే దాదాపు 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. దీని వల్ల దేశ రాజధానిలో దాదాపు రూ.75 వేల కోట్ల వ్యాపారం జరగనుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

గతేడాది ఇదే సీజన్‌లో దాదాపు 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయని.. శుభకార్యాల వల్ల ఆ సమయంలో దేశ వాణిజ్య వర్గాలకు రూ.3 లక్షల కోట్ల ఆదాయం చేకూరిందని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. పెళ్లిళ్ల ద్వారా ఈ సీజన్‌లో దాదాపు రూ.3,75,000 కోట్లు కొనుగోళ్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్తాయని అంచనా వేశారు. తరువాతి వివాహాల సీజన్ జనవరి 14 నుంచి ప్రారంభమై జులై వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: షార్ట్​ టర్మ్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త.. ఈ పథకాలైతే బెటర్!

ట్విట్టర్​ బాటలోనే మెటా సంస్థ.. భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.