ETV Bharat / business

Income Tax Investment Plan : ఆదాయం ఎక్కువగా.. పన్ను తక్కువగా ఉండాలా?.. ఇలా ప్లాన్ చేసుకోండి! - ఇన్​కమ్​ టాక్స్ సేవింగ్​ స్కీమ్​ జాగ్రత్తలు

Income Tax Investment Plan : మీరు భవిష్యత్​ కోసం పొదుపు, మదుపు చేస్తున్నారా? పన్ను భారం వీలైనంత తక్కువగా ఉండాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలను సరిగ్గా ఫాలో అయితే కచ్చితంగా మంచి రాబడిని సంపాదించగలుగుతారు. పైగా టాక్స్ భారం కూడా తగ్గుతుంది.

Income Tax Investment Plan
tax saving plans precautions
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:36 PM IST

Updated : Oct 14, 2023, 6:34 PM IST

Income Tax Investment Plan : పెట్టుబడులు పెట్టే ముందే, ఆదాయ పన్ను మినహాయింపుల కోసం కచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు టాక్స్​ డిడక్షన్​ ఎట్ సోర్స్ (TDS)​ వద్ద పన్ను కోత ఉంటుంది. అందుకే ఓల్డ్​ పింఛన్​ స్కీం విధానాన్ని ఎంచుకున్నవారు.. పన్ను ఆదా పథకాలలో మదుపు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాంటి పొరపాట్లకూ తావీయకూడదు. ఈ విధంగా మదుపు చేసినప్పుడే దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి వీలవుతుంది. అలాగే టాక్స్​ బెనిఫిట్స్​ కూడా లభిస్తాయి.

ప్రతి పెట్టుబడి పథకాన్నీ కొన్నాళ్లపాటు కచ్చితంగా కొనసాగించాలనే కండిషన్ ఉంటుంది. టాక్స్ సేవింగ్​ స్కీంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. మీ ఆర్థిక ప్రణాళికలు, లక్ష్యాలను అనుసరించి, వివిధ కాలవ్యవధులు ఉన్న పెట్టుబడులను ఎంపిక చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకూ తక్కువ లాకిన్‌ పీరియడ్​ ఉన్న పథకాలను ఎంచుకోవడమనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు.

పథకాలను ఎంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

  • పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు.. అవి మనకు ఏ మేరకు ఉపయోగపడతాయనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేసుకోవాలి. టాక్స్​ సేవింగ్​తోపాటు, సంపద సృష్టికీ అవి అవకాశం కల్పించాలి. అలాంటి స్కీంలను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • టాక్స్ సేవింగ్​ కోసం చివరి నిమిషంలో పెట్టుబడులు పెట్టడం మంచి పద్ధతి కాదు. దీంతో ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నెలనెలా చిన్న మొత్తాలతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలవుతుంది.
  • మొత్తం డబ్బును ఒకే పథకంలో పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామార్థ్నాన్ని అనుసరించి, పలు పథకాలను ఎంచుకొని, వైవిధ్యంగా ఇన్వెస్ట్​మెంట్​ చేయాలి. ఒకే పథకంలో పెట్టుబడి పెడితే అన్ని సమయాల్లో మంచి రాబడిని అందుకోలేకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
  • చాలామంది పన్ను ఆదా కోసం బీమా పాలసీలను తీసుకుంటారు. లైఫ్ ఇన్స్​రెన్స్​ పాలసీ ఒక తప్పనిసరి అవసరం. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలు తీసుకోవడం ఎప్పుడూ మంచి విషయమనే చెప్పాలి. ప్రీమియం ఎక్కువగా ఉండే ఎండోమెంట్‌ పాలసీలు, యూనిట్‌ ఆధారిత పాలసీలను పన్ను ఆదా కోసం తీసుకోవడం సరైంది కాదు. కష్టకాలంలో ఫ్యామిలీ మెంబర్స్​కు ఈ పాలసీలు పెద్దగా అండగా నిలవవు. కనుక మీ వయస్సు, ఆదాయం​, మీపై ఆధారపడిన వారు, మీ బాధ్యతలు.. ఇలా అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకొని, సరైన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిది. ఎక్కవ ప్రీమియం ఉన్న పాలసీలు తీసుకొని, తర్వాత సంవత్సరం ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. చాలా సమయాల్లో ప్రీమియాన్ని నష్టపోవాల్సి ఉంటుంది.
  • ఈక్విటీలు స్వల్పకాలంలో కాస్త అస్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని అందిస్తాయి. ఈక్విటీల నుంచి దూరంగా ఉండటం వల్ల లాంగ్​ టెర్మ్​లో సంపదను సృష్టించే అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుంది. కనుక ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. క్రమానుగత పెట్టుబడి విధానంలో వీటిలో ఇన్వెస్ట్​ చేయవచ్చు. కాకపోతే కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాలనే విషయాన్ని మర్చిపోవద్దు.
  • టాక్స్​ సేవింగ్​ స్కీమ్స్​లో ఇన్వెస్​ చేసేటప్పుడు చాలా మంది సెక్షన్‌ 80సీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి అదనంగా సెక్షన్‌ 80డీ (హెల్త్​ ఇన్స్​రెన్స్​), సెక్షన్‌ 80సీసీడీ (జాతీయ పింఛను పథకం) లాంటి వాటిని కూడా చూడాలి.

Best 5 Saving Schemes for Senior Citizens : వృద్ధాప్యంలో లాభాలు తెచ్చే.. సూపర్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!

Car Loan Precautions : కార్​ లోన్ కావాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!

Last Updated : Oct 14, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.