ITR Filing Last Date: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జులై 31. అయితే ఈ గడువును ఇక పొడిగించే అవకాశం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. కనుక టాక్స్ పేయర్స్ అందరూ కచ్చితంగా గడువులోగా ఐటీఆర్ సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది.
సెలవు దినాల్లోనూ దాఖలు చేయొచ్చు!
2023 Income Tax Return Dates : ఐటీఆర్ దాఖలు చేయడానికి కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అందుకే పన్ను చెల్లింపుదారులు శని, ఆదివారాల్లో సైతం ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపన్ను శాఖ అనుమతి ఇస్తోంది.
-
We express our gratitude to the taxpayers & tax professionals for helping us reach the milestone of 5 crore Income Tax Returns (ITRs), 3 days early this year, compared to the preceding year!
— Income Tax India (@IncomeTaxIndia) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Over 5 crore ITRs for AY 2023-24 have already been filed till 27th of July this year as…
">We express our gratitude to the taxpayers & tax professionals for helping us reach the milestone of 5 crore Income Tax Returns (ITRs), 3 days early this year, compared to the preceding year!
— Income Tax India (@IncomeTaxIndia) July 28, 2023
Over 5 crore ITRs for AY 2023-24 have already been filed till 27th of July this year as…We express our gratitude to the taxpayers & tax professionals for helping us reach the milestone of 5 crore Income Tax Returns (ITRs), 3 days early this year, compared to the preceding year!
— Income Tax India (@IncomeTaxIndia) July 28, 2023
Over 5 crore ITRs for AY 2023-24 have already been filed till 27th of July this year as…
"ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపులు తదితర సేవలు అందించడం కోసం 24x7 గంటల ప్రాతిపదికన ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ హెల్ప్‌డెస్క్ పనిచేస్తోంది. ముఖ్యంగా టాక్స్ పేయర్స్‌కు కాల్స్, లైవ్ ఛాట్స్, వెబ్ఎక్స్ సెషన్స్, సోషల్ మీడియా ద్వారా సహాయం అందిస్తున్నాం."
- ఇన్‌కం టాక్స్ ఇండియా ట్వీట్
5 కోట్ల ఐటీఆర్‌లు
2023 Income Tax Returns : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 5.3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. వీటిలో ఇప్పటికే దాదాపు 4.46 కోట్ల ఐటీఆర్‌లను ఈ-వెరిఫై కూడా చేసినట్లు తెలిపింది. అంటే ఆదాయ పన్ను శాఖ దాదాపు 88 శాతానికి పైగా ఐటీఆర్‌లను ఇప్పటికే ఈ-వెరిఫై చేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే వీటిలో 2.69 కోట్ల ఐటీఆర్‌లను పూర్తిగా ప్రాసెస్ కూడా చేసినట్లు వెల్లడించింది. అంటే ఐటీఆర్ సమర్పించిన వారికి రిఫండ్‌ను కూడా అందించినట్లు ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.
రిఫండ్ రావాలంటే!
ITR Return Online : వ్యక్తులు తాము ఆర్జించిన ఆదాయం, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా, సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవాలి. వాటిని పూర్తిగా ఫిల్ చేసి, ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఐటీఆర్ రిఫండ్ వస్తుంది.
పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు
Tax Payers In India : గతేడాదితో పోల్చితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. ఇంకా రెండు రోజులు గడువు ఉండగానే.. 5 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు కావడానికి సహకరించిన పన్ను చెల్లింపుదారులకు, పన్ను నిపుణులకు ఆదాయపన్ను శాఖ ధన్యవాదాలు తెలిపింది. మిగిలిన రెండు రోజుల్లో మరింతగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
నోట్ : గత ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయపన్ను శాఖ ఐటీఆర్ రిటర్నుల దాఖలు తేదీని పొడిగించలేదు. దీని వల్ల చాలా మంది ఆదాయ పన్ను రిఫండ్లను కోల్పోయారు. అలాగే అధిక పన్నుల భారాన్ని కూడా భరించాల్సి వచ్చింది. అందువల్ల చివరి నిమిషంలో ఉన్న రద్దీని తప్పించుకునేందుకు.. పన్ను చెల్లింపుదారులు అందరూ త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ కోరింది.
- ఇవీ చదవండి :
- Income Tax Refund : ఆదాయ పన్ను రిఫండ్ రావాలంటే.. ఇలా చేయండి!
- ITR Filing Process : మొదటిసారిగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి!
- Kalyan Jewellers MD : ఓ చిన్న దుకాణదారుడు.. నేడు వేల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు.. అతను ఎవరో తెలుసా?
- హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి!