ETV Bharat / business

How to Use Company Insurance After Lost Job : ఉద్యోగం మానేసినా.. కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు.. మీకు తెలుసా?

How to Use Company Insurance After Lost Job : ఉద్యోగులు ఒక కంపెనీలోకి వస్తుంటారు.. వెళ్తుంటారు. కొందరు రాజీనామా చేస్తే.. మరికొందరిని సంస్థ పంపించేస్తుంది. అయితే.. జాబ్ కోల్పోయినప్పటికీ, ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉపయోగించుకోవచ్చు అన్న సంగతి మీకు తెలుసా..?

How to Use Company Insurance After Lost Job

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 3:22 PM IST

How to Use Company Insurance After Lost Job : ఈ రోజుల్లో మాగ్జిమమ్ కంపెనీలు తమ ఎంప్లాయీస్​కు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్నాయి. భార్యాభర్తలు, పిల్లలకు కలిపి కంపెనీలు బీమా కమవరేజీ అందిస్తుంటాయి. ఇంతవరకూ బాగానే ఉంటుంది. కానీ.. అనివార్య కారణాలతో ఉద్యోగులు తమ జాబ్​ వదులుకోవాల్సి రావొచ్చు. కంపెనీ తొలగించడమో, లేదంటే.. ఉద్యోగులే రాజీనామా చేయడమో జరగొచ్చు. ఉద్యోగం పోయింది కాబట్టి.. సదరు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ కూడా పోయినట్టేనని చాలా మంది ఉద్యోగులు భావిస్తారు. కానీ.. మరో మార్గం ఉంది. ఉద్యోగం వదిలినప్పటికీ.. కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. మరి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRDAI ఏమంటోంది..?

Insurance Regulatory and Development Authority Rule : ఒక ఉద్యోగి ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో నుంచి బయటకు వెళ్లినప్పుడు.. ఆ కంపెనీ ఇచ్చిన హెల్త్ పాలసీని వ్యక్తిగత లేదా కుటుంబ పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి.. ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) ఉద్యోగులకు కీలక అవకాశం కల్పించింది. "ఉద్యోగం వదిలిన ఎంప్లాయ్ ఎవరైనా.. కంపెనీ ఇచ్చిన గ్రూప్ ఇన్సూరెన్స్​ను ఇండివిడ్యువల్ లేదంటే ఫ్యామిలీ కవర్ పాలసీగా మార్చుకోవచ్చు" అని IRDAI క్లియర్​గా చెప్పింది.

45 రోజుల ముందే తెలియజేయాలి

Inform Before Last 45 Days of Working : అయితే.. ఇందుకోసం ఉద్యోగి కొన్ని పనులు తప్పక చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం వదిలి వెళ్లడానికి ముందే.. ఈ విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేస్తుండగానే.. ఉద్యోగం వదిలి వెళ్లే చివరి 45 రోజుల ముందు ఈ పాలసీని పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు. అంటే.. ఉద్యోగం మానేసినప్పటికీ.. కాలపరిమితి వరకు ఇన్సూరెన్స్ కొనసాగేలా పోర్ట్ పెట్టుకోవచ్చన్నమాట. ఈ మేరకు సదరు ఉద్యోగి.. ఇన్సూరెన్స్ కంపెనీకి లెటర్ పెట్టుకోవాలి.

Securing Your Future - Why Term Insurance Plans Matter : మీకు బీమా ఉందా..? టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా..??

ఇక, ఉద్యోగి చివరి రోజు విధులు ముగిశాయని అనుకుందాం. ఆ తర్వాత ఈ విషయంలో మీ నిర్ణయం ఏమైనా మారిందా? అనేది తెలుసుకోవడానికి కూడా మీకు మరో 5 రోజుల గడువు ఉంటుంది. ఇన్సూరెన్స్ పోర్ట్ పెడుతున్నారా? లేదా? అన్నది లాస్ట్ వర్కింగ్ డే తర్వాత ఐదు రోజుల్లో కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. గ్రూప్ పాలసీ ఇన్సూరెన్స్ కు మాత్రమే.. ఈ పోర్టబిలిటీ ఆప్షన్ అప్లై అవుతుందని గుర్తుంచుకోవాలి.

How to Get Loan On Insurance Policy : మీకు డబ్బు అత్యవసరమా.. ఇన్సూరెన్స్​ పాలసీ ఉందా..??

ఇక, చివరగా మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఉద్యోగం వదిలి వెళ్లే ముందు వరకూ సదరు ఇన్సూరెన్స్​ ప్రయోజనాలను మీరు ఏమైనా వాడుకున్నారా? ఇన్సూరెన్స్ గడువు ఇంకా ఎంత ఉంది? అనే వివరాలు కూడా పోర్టబిలిటీ ద్వారా బదిలీ అవుతాయి. అయితే.. ఈ పోర్టింగ్ పైనా, ఇప్పటికే ఉన్న పాలసీపై అధిక కవరేజీ కావాలన్నా, తుది నిర్ణయం మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ చేతిలోనే ఉంటుంది. అందువల్ల.. ఈ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ విషయం సందేహాల నివృత్తికి.. బీమా కంపెనీ కస్టమర్ కేర్ ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

How to Claim LPG Insurance Policy: గ్యాస్​ సిలిండర్​ పేలితే ఇన్సూరెన్స్​.. ఎలా పొందాలో మీకు తెలుసా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.