ETV Bharat / business

పెళ్లి తర్వాత పాన్‌ కార్డుపై ఇంటి పేరు మార్చాలా? అయితే ఇలా చేయండి - surname changing process in pan card

పాన్ కార్డులో ఇంటి పేరును మార్చాలనుకుంటున్నారా? అయితే సులువుగా ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

How To Update Surname On pan card
పాన్ కార్డులో ఇంటి పేరు మార్చడం
author img

By

Published : Jan 7, 2023, 5:47 PM IST

How To Update Surname On PAN Card : మనం నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో పాన్‌ కార్డు కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును ఉపయోగిస్తుంటారు. కొందరైతే గుర్తింపు కార్డుగా కూడా (ఐడెంటీ ఫ్రూఫ్‌గా) దీన్ని వాడుతుంటారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా ఉంటాయి. ఇన్ని విధాలుగా ఉపయోగించే పాన్‌కార్డ్‌లో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్‌ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్‌ ద్వారానే పేరును మార్చుకోవచ్చు.

పాన్‌ కార్డ్‌లో పేరు మార్చుకోండిలా..

  • మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌ బ్రౌజర్‌లో టీఐఎన్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ (www.tin-nsdl.com) అని టైప్‌ చేస్తే, సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.
  • దాంట్లో సర్వీసెస్‌ విభాగంలో PAN అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • కిందకు స్క్రోల్‌ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్‌లో అప్లయ్‌పై క్లిక్‌ చేయాలి.
  • అందులో 'Application Type' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో 'Changes or Correction in existing PAN data'ని సెలక్ట్‌ చేయాలి.
  • పాన్‌ నంబర్‌ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు అందులో ఇవ్వాలి.
  • ఈ వివరాలన్నీ సబ్మిట్‌ చేశాక మీకో టోకెన్‌ నంబర్‌ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్‌పై క్లిక్‌ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి.
  • ఇప్పుడు పాన్‌ కార్డుకు సంబంధించిన కరెక్షన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్‌ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది.
  • సబ్మిట్‌ చేశాక పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.
  • పేమెంట్‌ అయిన వెంటనే మీరు కార్డును అప్‌డేట్‌ చేసినట్టుగా ఓ స్లిప్‌ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఆ స్లిప్‌ను ప్రింటవుట్‌ తీసుకుని దానిపై రెండు ఫొటోలు అతికించి సంబంధిత పత్రాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి పంపించాలి.
  • చిరునామా ఇదీ..
    NSDL e-Gov at Income Tax PAN Services Unit
    NSDL e-Governance Infrastructure Limited
    5th Floor, Mantri Sterling, Plot No. 341
    Survey No. 997/8, Model Colony
    Near Deep Bungalow Chowk, Pune- 411016

ఇవీ చదవండి:

పది సెకన్లలో పళ్లు క్లీన్ చేసే స్మార్ట్ బ్రష్ పాప ఏడుపును విశ్లేషించే ట్రాన్స్​లేటర్

రూ.15 వేలలోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.