ETV Bharat / business

How To Understand Insurance Documents : ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా?.. ఆ విషయాలన్నీ కచ్చితంగా తెలుసుకోండి! - ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను అర్థం చేసుకోవడం ఎలా

How To Understand Insurance Documents In Telugu : ఇన్సురెన్స్ పాల‌సీ తీసుకునే ముందు.. వాటికి సంబంధించిన ప‌త్రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి. అయితే చాలా మందికి వాటిని ఎలా చూడాలో.. ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. అందుకే ఆర్థిక నిపుణులు బీమా పాలసీ డాక్యుమెంట్లను ఎలా అర్థం చేసుకోవాలి? అందులోని విషయాలను ఎలా తెలుసుకోవాలో వివరంగా తెలియజేస్తున్నారు. మరి మనమూ ఆ విషయాలను తెలుసుకుందామా?

insurance policy understanding tips
How to understand Insurance Documents
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 1:36 PM IST

How To Understand Insurance Documents : ఈ కాలంలో దాదాపు అంద‌రూ ఇన్సూరెన్స్ పాల‌సీలు తీసుకుంటున్నారు. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. కానీ వీటిని తీసుకునే స‌మ‌యంలో ప‌త్రాలు పూర్తిగా చ‌ద‌వ‌కపోతే, త‌ర్వాత చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. సామాన్యుల‌కు అవి అంత సుల‌భంగా అర్థం కావు. అందుకే బీమా పాల‌సీ ప‌త్రాలు క్షుణ్ణంగా చ‌ద‌వ‌డానికి నిపుణులు కొన్ని సూచన‌లు ఇచ్చారు. వాటిని ఫాలో అయితే మనకు ఎంతో ప్ర‌యోజ‌నకరంగా ఉంటుంది.

వాస్తవానికి బీమా పాల‌సీ ప‌త్రాలు క్లిష్ట‌మైన ప‌ద‌జాల‌తో నిండి ఉంటాయి. వాటిని స‌రిగ్గా చ‌దివి అర్థం చేసుకోకుండానే సంత‌కం పెడితే.. త‌ర్వాతి కాలంలో బీమా క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ లాంటివి జ‌ర‌గవచ్చు. ముఖ్యంగా పాల‌సీ క‌వ‌రేజీ, ప్ర‌త్యేక‌త‌లు వివ‌రించే ఫైన్ ప్రింట్‌ను జాగ్ర‌త్త‌గా చదివి అర్థం చేసుకోవాల్సిన అవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. పాల‌సీలో దీనికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇది బీమా ప్రొవైడర్​కు, పాలసీదారునకు మధ్య ఉన్న స్ప‌ష్ట‌మైన ఒప్పందాన్ని తెలియజేస్తుంది. దీనితో పాటు.. పాల‌సీకి సంబంధించిన ఇత‌ర ప‌త్రాల‌పై కూడా సరైన ప‌రిజ్ఞానం పెంచుకుంటే.. మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఎంపిక‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో నిపుణులు ఇస్తున్న సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా!

1. పాలసీ లిక్విడిటీని అంచనా వేయడం
కొన్ని బీమా పాల‌సీలకు లాక్​ ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. అంటే పాల‌సీదారులు ముంద‌స్తుగా బీమా సొమ్మును పొందలేరు. లేదా బీమా నుంచి ఉపసంహరణలు చేసుకోలేరు. ఒక వేళ ఇలా చేస్తే జ‌రిమానా సైతం విధించే అవకాశాలు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు లింక్డ్ ఇన్సూరెన్స్ పాల‌సీలకు 5 ఏళ్ల లాక్​ ఇన్ పీరియడ్
ఉంటుంది. ఈ 5 ఏళ్లలోపు మీకు ఎలాంటి బీమా లభించదు. అందుకే పాల‌సీ కొనుగోలు చేయడాని కంటే ముందు.. లిక్విడిటీ నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.

2. వెయిటింగ్ పిరియ‌డ్ గ్రహించ‌డం
కొన్ని హెల్త్ పాల‌సీలు వెయిటింగ్ పిరియ‌డ్​ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ నిరీక్షణ వ్యవధి అనేది ఆయా పాలసీలను అనుసరించి మారుతూ ఉంటుంది. ఈ వెయిటింగ్ పిరియడ్ పూర్తి అయ్యే వరకు పాలసీ యాక్టివేట్​ అవ్వదు. అప్పటి వరకు మీకు ఎలాంటి బీమా సొమ్ము లభించదు.

3. బోన‌స్​ల గురించి ఆలోచించ‌వ‌ద్దు
ఇన్సూరెనస్​ పాల‌సీల్లో.. పేఅవుట్​ బోన‌స్​లకు ఎలాంటి గ్యారెంటీ ఉండ‌దు. ఇది కేవలం బీమా కంపెనీల విచ‌క్ష‌ణ‌, లాభంపై మాత్రమే ఆధార‌ప‌డి ఉంటుంది.

4. క్లెయిమ్ క్లాజులను పరిశీలించండి
పాల‌సీ వివ‌రాల్లో త‌ప్పులు ఉన్నా, కొన్ని విష‌యాలు దాచిపెట్ట‌ినా.. ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్​లను చెల్లించడానికి నిరాకరిస్తాయి. సాధారణంగా మొదటి రెండు సంవత్సరాల్లో ఈ ప్రమాదం ఉంటుంది. అయితే బీమా చట్టం- 1938, సెక్షన్ 45 ప్రకారం.. మూడేళ్ల త‌ర్వాత ఈ కార‌ణాల‌తో క్లెయిమ్​లు తిర‌స్క‌రించ‌డానికి వీలులేదు.

5. మినహాయింపులను అర్థం చేసుకోండి
కొన్ని పాల‌సీలు అన్ని ర‌కాల వాటిని క‌వ‌ర్ చేసిన‌ట్టు పైకి కనిపించినా.. వాటిలో కొన్నింటిని మినహాయించే అవ‌కాశ‌ం ఉంటుంది. ముఖ్యంగా ఆయా పాలసీలు తీవ్రమైన అనారోగ్యం, మరణం, వైకల్యం లాంటి సమస్యలను కవర్​ చేయవచ్చు.. లేదా కొన్ని రకాల రోగాలను కవర్ చేయకపోవచ్చు. అందుకే పాలసీ తీసుకునే ముందే వీటన్నింటి గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి.

6. ప్రీమియం చెల్లింపు నిబంధనలను అర్థం చేసుకోండి
జీవిత బీమా పాలసీలు సాధారణ, పరిమిత ప్రీమియం చెల్లింపులను కలిగి ఉంటాయి. అయితే, జనరల్ ఇన్సూరెన్స్‌లో మీరు 2 నుంచి 5 సంవత్సరాల వ్యవధికి ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని (లప్సమ్​) చెల్లించే అవకాశం ఉంటుంది.

7. ఆరోగ్య బీమా పోర్టబిలిటీ
మీరు ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడే.. దానిలో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉందో లేదో చెక్​ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు హెల్త్ ఇన్సూరెన్స్​ను ట్రాన్స్​ఫర్​ చేసుకోగలుగుతారు.

8. పెన్ష‌న్ ప్లాన్ల‌ను తెలుసుకోండి
పెన్షన్​ ప్లాన్​ ఎంచుకునేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు జీవితాంతం పెన్షన్​ పెందాలని అనుకుంటే.. అందుకు తగిన పాలసీ ఎంచుకోవాలి. లేదా మీరు పెట్టిన డబ్బులతో పెన్షన్​తో పాటు మంచి రిటర్న్స్​ కూడా రావాలనుకుంటే.. అందుకు అనుగణమైన పాలసీ తీసుకోవాలి. జాయింట్​ లైఫ్​ ఆప్షన్​ ఎంచుకోవాలి.

లిక్విడిటీ, వెయిటింగ్ పిరియడ్‌లు, క్లెయిమ్ ప్రొసీజర్‌లు, మినహాయింపులను అర్థం చేసుకోవడానికి ఫైన్ ప్రింట్‌ను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. అందులోని ప‌ద‌జాలం క్లిష్టంగా, మీకు అర్థం కాకుండా ఉన్న‌ట్ల‌యితే.. ఎలాంటి మొహమాటం లేకుండా సదరు బీమా సంస్థ నుంచి వివ‌ర‌ణ కోర‌ండి. పాల‌సీలోని ప్ర‌తి ప‌దం, ష‌ర‌తును మొత్తం అర్థం చేసుకున్నాకే.. మీకు ఉపయోగపడే మంచి పాల‌సీని ఎంచుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.