ETV Bharat / business

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి! - సరైన క్రెడిట్​ కార్డ్ ఎంచుకోవడం ఎలా

How To Save Money Using Credit Card : పండుగ సీజన్​లో భారీగా షాపింగ్ చేయాలని అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అన్నీ చక్కగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. క్రెడిట్​ కార్డ్​ను తెలివిగా ఉపయోగించి ఎలా షాపింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how to save money using credit card
Credit Card Usage Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 3:09 PM IST

How To Save Money Using Credit Card : పండుగ సీజన్ వచ్చేసింది. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్​సైట్లు అన్నీ భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్​ ప్రకటిస్తున్నాయి. ఆఫ్​లైన్​ స్టోర్స్​, షాపింగ్ మాల్స్​ కూడా అదిరిపోయే డీల్స్ అందిస్తున్నాయి. మరి మీరు కూడా భారీగా షాపింగ్​ చేయాలని అనుకుంటున్నారా? అయితే కాస్త తెలివిగా ఆలోచించండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్​ ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే ముందు.. ఇక్కడ తెలిపిన కొన్ని కీలకమైన విషయాలను గుర్తుంచుకోండి. (Top Tips To Use Credit Cards Wisely For Festival Shopping)

ముందే బడ్జెట్​ వేసుకోవాలి!
క్రెడిట్​ కార్డ్​ను చాలా జాగ్రత్తగా, తెలివిగా వాడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు లాభపడతారు. లేకుంటే.. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు.​ ఇలా జరగకుండా ఉండాలంటే.. ముందుగానే మీకు అవసరమైన వస్తువుల లిస్ట్ తయారు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా బడ్జెట్​ను ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత ఈ బడ్జెట్​ మీ ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మీ ఆదాయం, అప్పులు, కట్టాల్సిన ఈఎంఐలు, ఖర్చులు అన్నింటినీ సరిగ్గా బ్యాలెన్స్ అయ్యేలా బడ్జెట్​ను ప్లాన్ చేసుకోవాలి. ఒక వేళ మీ బడ్జెట్​ లిమిట్స్​ దాటితే .. అనవసరమైన, ఫ్యాన్సీ వస్తువులను నిర్మొహమాటంగా మీ లిస్ట్​ నుంచి తొలగించండి.

సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోవాలి!
How To Choose Right Credit Card : క్రెడిట్​ కార్డ్​ను ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాఫ్యులర్​ రిటైలర్స్​, ఆన్​లైన్ మార్కెటింగ్ వెబ్​సైట్స్ అందించే ఆఫర్స్​, డిస్కౌంట్స్​, క్యాష్​బ్యాక్​లను.. ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే క్రెడిట్ కార్డ్​ను ఎంచుకోవాలి. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పండుగ సీజన్​ కోసమే క్రెడిట్ కార్డ్​లను అందిస్తూ ఉంటాయి. వాటిని కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే అవి మంచి క్యాష్​బ్యాక్​, జీరో- ఇంట్రస్ట్​ ఈఎంఐ ఆప్షన్​లను కలిగి ఉంటాయి. కొన్ని క్రెడిట్​ కార్డులను యాన్యువల్​ ఫీజు లేకుండా అందిస్తూ ఉంటారు. మరికొన్ని క్రెడిట్​ కార్డులను తక్కువ వడ్డీ రేటుతో అందిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల మీ షాపింగ్ ఖర్చులు భారీగా తగ్గుతాయి.

క్రెడిట్​ లిమిట్​ దాటవద్దు!
Credit Card Limit Check : ప్రతి క్రెడిట్ కార్డ్​కు ఒక లిమిట్​ ఉంటుంది. ఆ పరిమితిని దాటి క్రెడిట్ వాడుకోవడం మంచిది కాదు. సాధారణంగా మన క్రెడిట్ లిమిట్​లో 30 శాతానికి మించి వాడకపోవడం మంచిది. పండుగ సీజన్​లో భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్​బ్యాక్స్, డీల్స్ మనల్ని ఊరిస్తూ ఉంటాయి. వీటి ట్రాప్​లో పడితే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఒక వేళ మీరు కచ్చితంగా షాపింగ్ చేయాల్సి వస్తే.. మీ క్రెడిట్​ కార్డ్ లిమిట్​ను తాత్కాలికంగా పెంచమని.. సదరు క్రెడిట్ కార్డును ఇష్యూ చేసిన బ్యాంక్​ను రిక్వెస్ట్ చేయండి.

రీపేమెంట్స్ సకాలంలో చేయాలి!
Credit Card Repayment Plan : వాస్తవానికి క్రెడిట్​ కార్డ్​ను.. లిమిట్​కు మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. ఒకవేళ చేసినా సకాలంలో వాటిని తీర్చేయాలి. లేకుంటే భారీ మొత్తంలో వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్​ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల భవిష్యత్​లో మీకు రుణం లభించే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. ఒక వేళ మీపై ఈఎంఐ భారం ఎక్కువగా ఉంటే.. దానిని కొంత మేరకు తగ్గించమని.. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన బ్యాంకును రిక్వెస్ట్ చేయండి.

ఆఫర్లను, రివార్డ్​లను పోల్చి చూడండి!
పండుగ సీజన్​లో చాలా ఆన్​లైన్ షాపింగ్ పోర్టల్స్​, ఆఫ్​లైన్​ స్టోర్​లు.. నిర్దిష్టమైన క్రెడిట్ కార్డులపై ప్రత్యేకమైన ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్​బ్యాక్స్ అందిస్తూ ఉంటాయి. అందువల్ల షాపింగ్​ చేసే ముందు.. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా సదరు ఆఫర్స్​, రివార్డ్ పాయింట్స్ లభిస్తున్నాయో? లేదా? చూసుకోవడం మంచిది. ఒకవేళ ఆఫర్లు కనుక అప్లై అయితే.. మీ షాపింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని క్రెడిట్ కార్డులు.. అడిషినల్ వారెంటీ కవరేజ్, పర్చేస్​ ప్రొటక్షన్​, ట్రావెల్​ బెనిఫిట్స్ కూడా కల్పిస్తాయి.​ అందువల్ల ఒక మంచి ప్లానింగ్​తో క్రెడిట్ కార్డులను వాడుకుంటే.. భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంటుది. ​

ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుండాలి!
How To Track Credit Card Transactions : పండుగ సీజన్​లో మనం వేర్వేరు చోట్ల.. వేర్వేరు వస్తువులను కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఆన్​లైన్, ఆఫ్​లైన్ షాపింగ్​ చేస్తూ.. క్రెడిట్ కార్డ్​ ఉపయోగించి చాలా పేమెంట్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఓవర్​లుక్​లో పరిమితికి మించి ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ సమస్యను నివారించడానికి.. ఎప్పటికప్పుడు క్రెడిట్​ కార్డ్ ట్రాన్సాక్షన్స్​ని ట్రాక్ చేస్తూ ఉండాలి.

అనవసర ఖర్చులు తగ్గించాలి!
How To Stop Impulsive Spending : వాస్తవానికి పండుగ సీజన్​లో భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​, డీల్స్ మనల్ని టెంప్ట్​ చేస్తూ ఉంటాయి. అందువల్ల చాలా మంది అవసరం లేకపోయినా.. క్రెడిట్​ కార్డ్ ఉపయోగించి అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని వల్ల తాత్కాలికంగా హ్యాపీగా అనిపించినా.. తరువాత వాటి ఈఎంఐ భారాన్ని మోయాల్సి వస్తుంది. కనుక వీలైనంత వరకు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.